Begin typing your search above and press return to search.
కాజల్-గౌతమ్ జంట రొమాంటిక్ దివాళీ
By: Tupaki Desk | 5 Nov 2021 7:32 AM GMTచందమామ కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లు గతేడాది ఆక్టోబర్ లో వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఇద్దరూ ప్రేమించుకుని పెద్దల్ని ఒప్పించి లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కోవిడ్ కారణంగా ఇద్దరు మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోయారు. విదేశాలకు ప్లైట్ లు రద్దవ్వడం.. పండగలు.. పబ్బాలు సైతం సరిగ్గా జరుపుకోకపోవడంతో ఆ జంట కొన్నింటిని మిస్ అయింది. గత ఏడాది దేశ ప్రజలంతా అన్ని వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ జంట మొదటి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోలేదు.
ప్రస్తుతం కొవిడ్ అదుపులో ఉంది. పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయి. దీంతో ప్రజలు సాధారణ జీవన విధానం మొదలైంది. ఈ దీపావళిని అంతా బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాజల్ -గౌమత్ కిచ్లు జంట కూడా ఈ దీపావళిని ధూమ్ ధామ్ అనిపించారు. పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి దీపావళిని ఎలాగూ మిస్ అయ్యారు. దీంతో ఈ దివాళీని మాత్రం కుటుంబ సభ్యులతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని కాజల్ ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాజల్ ఆర్గాన్జా శారీ..స్లీవ్ లెస్ బ్లౌజ్ తో సంప్రదయ వస్త్రాల్లో కనిపిస్తున్నారు. చందమామ ధరించిన రైన్ స్టోన్ అభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి పండగను రొమాంటిక్ గా జరుపుకోవాలి అనేంతగా ఈ జంట సాటి జంటలకు స్ఫూర్తిని నింపుతుండడం ఆసక్తికరం.
కాజల్ చీరలో నిజంగా చందమమాను మించిన అందంతో కనిపిస్తోంది. ఇక గౌతమ్ రెడ్ సిల్క్ కుర్తా ధరించాడు. ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. దేవుడికి నైవేద్యాలు వడ్డించారు. ఈ సందర్భంగా కాజల్ ఓ పోస్ట్ కూడా పెట్టింది. లోపల నుంచి ప్రకాశించే కాంతిని ఏదీ తగ్గించలేదు. దానికి ఎవరూ అతీతలు కాదు. చిన్న నాటి జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం. నోటి నిండా తీపి పదార్ధాలు.. ఇంట్లో కుటుంబ సభ్యుల హడావుడితో ఎంతో సంతోషంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా అందరూ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు కాజల్ వ్యాఖ్యను జోడించారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `ఆచార్య`లో నటించిన సంగతి తెలిసిందే.