Begin typing your search above and press return to search.

ప్ర‌స‌వం పై కాజ‌ల్ ఎమోష‌నల్ పోస్ట్!

By:  Tupaki Desk   |   21 April 2022 7:40 AM GMT
ప్ర‌స‌వం పై కాజ‌ల్ ఎమోష‌నల్ పోస్ట్!
X
న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్ మాతృమూర్తిగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. పండంటి మ‌గ‌బిడ్డ‌కు జన్మ‌నిచ్చి అమ్మ‌గా మారింది. ప్ర‌స్తుతం త‌ల్లి అయిన ఆ మ‌ధుర క్ష‌ణాల్ని గుర్తు చేసుకుంటుంది. గ‌ర్భం దాల్చినప్ప‌టి నుంచి ప్ర‌స‌వం వ‌ర‌కూ కాజ్ అనుభ‌వాల్ని స్మ‌రించుకుంటుంది. ఇక ప్ర‌స‌వం స‌మ‌యంలో త‌న అనుభూత‌ల్ని-తల్లి-బిడ్డ‌ల గొప్ప‌ద‌నం గురించి చెప్పే ప్రయ‌త్నం చేసారు. ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా త‌న బిడ్డ గురించి సుదీర్ఘ‌గా ఓ పోస్ట్ పెట్టారు.

"ప్రసవానంతరం ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు కానీ అది ఖచ్చితంగా ఎంతో అందంగా ఉంటుందని చెప్ప‌గ‌ల‌ను. నా బిడ్డ నీల్‌ని ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ప్రసవం అనేది ఎంతో సంతోషకరమైనది. అఖండమైనది.

సహనం సుదీర్ఘమైనది. ఇది అత్యంత సంతృప్తికరమైన అనుభవం! "నీల్ పుట్టిన సెకనులోపు తెల్లటి శ్లేష్మ పొర - ప్లాసెంటాతో కప్పబడటం. నా ఛాతీపై పట్టుకోవడం స్వీయ వాస్తవికతతో నా ఏకైక ప్రయత్నం. ఇదంతా అనిర్వచనీయమైన అనుభూతి.

ఆ ఒక్క క్షణం ప్రేమ యొక్క లోతైన సామర్థ్యాన్ని నాకు అర్థమయ్యేలా చేసింది. నాలో విపరీతమైన కృతజ్ఞతా భావాన్ని కలిగించింది. నా శరీరం వెలుపల నా హృదయం యొక్క బాధ్యతను గ్రహించాను. అయితే ఇది అంత సులభ‌మైంది కాదు . నిద్రలేని మూడు రాత్రులు గ‌డిపాను. తెల్లవారుజామున తీవ్రీ మైన‌ రక్తస్రావం అయింది. గొళ్ళెం - బర్ప్- మెత్తని బొడ్డు మరియు సాగిన చర్మం - ఘనీభవించిన ప్యాడ్‌లు- బ్రెస్ట్ పంపులు- అనిశ్చితి ఇలా ప్రతిదీ సరిగ్గా చేస్తుంటే నిరంతరం ఆందోళన చెందుతారు.

తెల్లవారుజామున మధురమైన కౌగిలింతలు.. ఆత్మవిశ్వాసంతో ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకోవడం.. ఆరాధ్యమైన చిన్న ముద్దులు.. మేము ఇద్దరం మాత్రమే ఉన్న నిశ్శబ్ద క్షణాలు ఎంతో అద్భ‌త‌మైన‌వి. వాటిని ఎప్ప‌టికీ ఏ త‌ల్లి మ‌ర్చిపోలేదు.

ప్ర‌స‌వం అనేది ఎంతో అద్భుతమైన ప్రయాణం అని కాజ‌ల్ అన్నారు. కాజ‌ల్ తొలి సంతానంతో ఎంతో సంతోషంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పేగు బంధాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్ర‌స‌వ స‌మ‌యంలో త‌ను అనుభ‌వాల్ని చాలా చ‌క్క‌గా చెప్పే ప్ర‌య‌త్నం ప్ర‌శ‌స‌నీయం. కాజ‌ల్ ఇంకొన్నాళ్ల పాటు సినిమాలు దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఆమె 'ఇండియ‌న్ -2'లో న‌టిస్తున్నారు. అలాగే 'ఆచార్య‌'లో నూ న‌టిస్తున్నారు . ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుంది.