Begin typing your search above and press return to search.

వీడియో : చందమామ ఈజ్ బ్యాక్‌

By:  Tupaki Desk   |   21 Sep 2022 12:57 PM GMT
వీడియో : చందమామ ఈజ్ బ్యాక్‌
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ మళ్లీ సినిమాల్లో నటిస్తుందా... మునుపటి అందంతో కాజల్‌ అగర్వాల్‌ కనిపించబోతుందా అంటూ రకరకాలుగా అనుమానాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇటీవలే కాజల్ అమ్మ అయ్యింది. సాదారణంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా కొందరు ఆడవారు తమ పూర్వ రూపం ను పొందడం లో ఇబ్బంది పడతారు. కానీ కాజల్‌ కి ఆ సమస్య రాలేదు.

అభిమానులతో పాటు ఇండస్ట్రీ లో ఉన్న వారి యొక్క అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ వీడియోను షేర్‌ చేసింది. ఒక మగధీర.. ఒక డార్లింగ్‌ సినిమాలో కనిపించినట్లుగానే కాజల్ మళ్లీ కనిపిస్తుంది అంటూ అభిమానులు ఈ వీడియోకు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు చాలా మంది అభిమానులు కాజల్‌ ఈజ్ బ్యాక్‌ అని.. టాలీవుడ్‌ చందమామ మళ్లీ వచ్చిందన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ వీడియో తో ఇంట్రెస్టింగ్‌ విషయాలను కాజల్‌ అగర్వాల్ షేర్ చేసుకుంది. అమ్మను అయిన తర్వాత నాలుగు నెలలకు నేను మళ్లీ పనిలోకి దిగాను. ఇప్పుడు అంతా కొత్తగా అనిపిస్తుంది అన్నట్లుగా కాజల్‌ అగర్వాల్‌ పేర్కొంది. నా శరీరం లో మార్పు రావచ్చు.. నా యొక్క ఆత్మ విశ్వసం మాత్రం తగ్గలేదు అన్నట్లుగా కాజల్‌ చాలా విశ్వాసంతో ముందు ముందు సినిమాలు చేయబోతున్నట్లుగా పేర్కొంది.

ఇండియన్‌ 2 సినిమా షూటింగ్‌ లో కమల్‌ హాసన్ తో కలిసి కాజల్ అగర్వాల్‌ జాయిన్ అవ్వబోతుంది అన్నట్లుగా మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులకు థాంక్యూ చెబుతూ ఇండియన్ 2 షూటింగ్‌ కోసం కసరత్తు చేస్తున్నట్లుగా పేర్కొంది. అంతే కాకుండా గుర్రపు స్వారీ చేయడం తో కాజల్‌ మునుపటి ఉత్సాహంతో ముందు ముందు నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. అయితే ఈమెకు గతంలో మాదిరిగా ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.