Begin typing your search above and press return to search.

భ‌ర్త‌తో ఫ‌స్ట్ హోలీ.. కాజ‌ల్ ప్లానింగ్ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   29 March 2021 6:16 AM GMT
భ‌ర్త‌తో ఫ‌స్ట్ హోలీ.. కాజ‌ల్ ప్లానింగ్ ఏంటో తెలుసా?
X
హోలీ సంబ‌రాల్లో మునిగిపోవాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి? అద్దెకు తెచ్చిపెట్టుకున్న పెద్దరికాలతో బంధనాలు వేసుకునేవారిని మినహాయిస్తే.. రంగుల్లో తేలియాడాలనే కోరుకుంటారు అందరూ. ఇందుకోసం ముంద‌స్తు ప్లానింగులు కూడా చేస్తుంటారు. ఇదే ప్లానింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంది కాజ‌ల్.

గ‌త అక్టోబ‌రులో బిజినెస్ మెన్ కిచ్లూను పెళ్లి చేసుకుంది కాజ‌ల్‌. కొత్త‌పెళ్లి దంప‌తుల జోరు, హుషారు ఏవిధంగా ఉంటుందో తెలిసిందే. సెల‌బ్రిటీల‌కు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబ‌ట్టి.. ‘అనుభ‌వించు రాజా..’ అని పాటేసుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. పెళ్లి త‌ర్వాత ఏడాదిలోపు వ‌చ్చే ప్ర‌తీ పండుగలో వారే స్పెష‌ల్ అట్రాక్షన్ గా ఉంటారు. ఈ క్ర‌మంలో హోలీ పండుగ కూడా త‌మ జీవితంలో సంతోష‌క‌ర‌మైన రంగులు వెద‌జ‌ల్లుతోంద‌ని చెబుతోంది కాజ‌ల్‌.

చిన్న‌నాటి నుంచి త‌న జీవితంలో హోలీకి ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని చెబుతోంది. ఇప్పుడు పెళ్లయిన త‌ర్వాత వ‌చ్చిన మొద‌టి హోలీ కాబ‌ట్టి.. ఇంకా ఎగ్జ‌యిట్ గా ఫీల‌వుతున్న‌ట్టు చెబుతోంది. అయితే.. కొవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌రిమితంగా జ‌రుపుకోవాల్సి వ‌స్తోంద‌ని కాస్త ఫీల‌వుతోంది.

అయిన‌ప్ప‌టికీ.. ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో రచ్చ చేస్తాన‌ని చెబుతోంది. నేచుర‌ల్ క‌ల‌ర్స్ తో, క‌చోరీ వంటి స్వీట్ల‌తో హోలీ క‌చేరీ కొన‌సాగిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత పూజ‌ల‌తో ఈ హోలీని ముగిస్తామ‌ని చెబుతోంది చంద‌మామ‌. సో.. కాజ‌ల్ దంప‌తుల‌తోపాటు అంద‌రికీ మ‌నం కూడా చెప్పేద్దాం ‘హ్యాపీ హోలీ’.