Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : చందమామ తర్వాత యోగా గురువు అయ్యేనా?
By: Tupaki Desk | 5 July 2021 4:30 AM GMTటాలీవుడ్ లో చందమామ అంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను స్టార్ డమ్ ను దక్కించుకుని సుదీర్ఘ కెరీర్ తో దూసుకు పోతున్న కాజల్ అగర్వాల్ ఇటీవలే వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ అమ్మడు సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఇక పెళ్లి అయ్యినా.. మూడున్నర పదుల వయసు దాటినా కూడా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు. ఈ అందం కోసం కాజల్ చాలా వర్కౌట్స్ చేస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ గా వర్కౌట్ లు చేయడంతో పాటు ఇలా యోగా ఆసనాలు వేయడం వల్లే ఈమె ఇంత అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాజల్ షేర్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి ఆసనాలు సాదారణంగా ఎవరికి వేయరాదు. అప్పుడప్పుడు యోగా చేసే వారు ఇలాంటి ఆసనాలు వేయడం దాదాపుగా అసాధ్యం. కాని అనూహ్యంగా కాజల్ అగర్వాల్ వేసిన ఈ ఆసనం నోరు వెళ్లబెట్టేలా చేసింది. కాజల్ చాలా ఏళ్లుగా యోగా రెగ్యులర్ గా చేస్తూ ఉండటం వల్లే ఈ ఆసనం సాధ్యం అయ్యిందని కొందరు అంటున్నారు.
కాజల్ ఈ ఆసనం చూసిన కొందరు నెటిజన్స్ స్పందిస్తూ.. చందమామ ప్రస్తుతం హీరోయిన్ గా బిజీగా ఉంది.. భవిష్యత్తులో సినిమాలు లేనప్పుడు ఇలా యోగా ఆసనాలు వేసుకుని యోగా గురువుగా మారవచ్చు. ఆమె కు యోగాలో అంత ప్రావిణ్యం ఉన్నట్లుగా ఈ ఆసనంను చూస్తుంటే అనిపిస్తుందని కొందరు అంటున్నారు. మరో వైపు యోగా ఆసనంతో కాజల్ యువకుల గుండెల్లో గుబులు కూడా పుట్టిస్తోంది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. మరి కొన్ని సినిమాలు మరియు వెబ్ ప్రాజెక్ట్ లు కూడా ఈమె చేతిలో ఉన్నాయి.