Begin typing your search above and press return to search.
ఆంధ్రా వంటలకు అంబాసిడర్ అయిన కాజల్
By: Tupaki Desk | 9 May 2020 6:11 AM GMTకరోనా కారణంగా లాక్ డౌన్ కారణంగా పలువురు సెలబ్రెటీలు తమ కొత్త విద్యలను ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడు షూటింగ్స్ తో బిజీగా ఉండే స్టార్స్ ఈ లాక్ డౌన్ టైంను ఇతర విషయాలపై దృష్టి పెట్టారు. పలువురు స్టార్స్ వంట చేస్తున్న వీడియోలను మనం ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చూశాం. తాజాగా కాజల్ కూడా వంట చేసింది. అది కూడా ఆంధ్రా మీల్స్. ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన వంటకాలను ఆమె తన కుటుంబ సభ్యులకు వండి పెట్టింది.
షూటింగ్స్ లేని కారణంగా ఆంధ్రా మీల్స్ ను మిస్ అవుతున్నాను. అందుకే నేనే సొంతంగా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే బెండకాయ పులుసు.. సోరకాయ పచ్చడి మరియు పెసరట్టును వేసినట్లుగా ట్వీట్ చేసింది. తెలుగు జనాలకు ఈ మూడు కూడా చాలా దగ్గర అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూడు కూడా తెలుగు వారికి ట్రేడ్ మార్క్ వంటకాలు. వీటి రుచి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఉత్తరాది వారికి కనీసం వీటిని ఇలా చేస్తారనే విషయం కూడా తెలియదు.
అలాంటిది కాజల్ ఆంధ్రా వంటకాలను ముంబయిలో చేయడంతో పాటు తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఫొటోలతో సహా పెట్టడంతో ఇప్పుడు ఉత్తరాది వారి నాలుక కూడా ఊరుతున్నట్లుగా ఉంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ లో ఇలాంటి విద్య కూడా దాగి ఉందా అంటూ మరికొందరు అనుమానంగా చూస్తున్నారు. మొత్తానికి ఆంధ్రా వంటకాలకు మంచి పబ్లిసిటీ చేసిన కాజల్ కు తెలుగు వారు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆంధ్రా మీల్స్ కు కాజల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.