Begin typing your search above and press return to search.
అబ్బో.. కస్సుబుస్సుమంటున్న కాజల్
By: Tupaki Desk | 18 Jan 2017 5:16 AM GMTమెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150 హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మీడియా ఇంటర్వ్యూల్లో ఈ భాగంగా అడుగుతున్న ప్రశ్నలకు ఈ అమ్మడు ఇచ్చే ఆన్సర్స్ వింటుంటే మతి పోవాల్సిందే.
టాలీవుడ్ లో తక్కువ సినిమాలు చేస్తున్నారు ఎందుకు అని అడిగితే.. 'గతేడాది నేను తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం.. జనతా గ్యారేజ్ చేశాను. హిందీలో దో లఫ్జోం కీ కహానీలో నటించాను. తమిళ్ లో కావలై వేందాం చేశాను. ఒకే ఏడాది నాలుగు సినిమాల్లో నటిస్తే.. అందులో రెండు తెలుగు సినిమాలే. అంటే.. నా టైం సగం తెలుగుకే కేటాయించి.. మిగతా టైం ను మిగిలిన భాషలకు కేటాయిస్తున్నాను. ఇక నేను టాలీవుడ్ కి ఇంపార్టెన్స్ తగ్గించాను అనడంలో అర్ధం లేదు' అంటూ సుదీర్ఘమైన క్లాస్ పీకేసింది టాలీవుడ్ చందమామ. ఇక సినిమాలు తగ్గించుకోవడానికి వేరే కారణం ఏదైనా ఉందే అనే ప్రశ్నకైతే కాజల్ ఆడిన వెటకారం ఓ రేంజ్ లో ఉంది.
'నువ్వు రోజుకు ఎన్ని గంటలు పని చేస్తావ్' అని కాజల్ అడిగితే.. ఆ వ్యక్తి 24 హవర్స్ అని చెప్పడంతో.. 'ఓహ్.. అయితే నువ్వు సూపర్ మ్యాన్ అన్నమాట' అంటూ చప్పట్లు కొట్టి వెక్కిరించింది కాజల్. 'నేను రోజుకు 12-15 గంటలు. అక్కడికే అలసిపోతాను. తెలుగు-తమిళ్-హిందీ భాషల్లో బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తున్నా' అని చెప్పింది కాజల్ అగర్వాల్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/