Begin typing your search above and press return to search.

మనసుకు నచ్చితేనే ఒప్పేసుకుంటోంది

By:  Tupaki Desk   |   24 May 2015 3:30 AM GMT
మనసుకు నచ్చితేనే ఒప్పేసుకుంటోంది
X
క్యూట్‌ కాజల్‌ ఇటీవలి కాలంలో తెలుగు అవకాశాల్ని ఒడిసిపట్టుకోవడానికి కావాలనే వెనుకాడుతోంది. అందుకే తమిళంలో బిజీ అయిపోయింది కూడా. టాలీవుడ్‌లో పరమ రొటీన్‌ మూస పాత్రల్లో నటించే కంటే తంబీలు చేసే ఎక్స్‌పెరిమెంట్లలో భాగం అయితేనే బావుంటుందని భావించి కోలీవుడ్‌ వెళ్లిపోయింది.

అందుకు తగ్గట్టే వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికిప్పుడు అక్కడ ఓ మూడు సినిమాల్లో నటించేస్తోంది. ఇలా చేయడానికి కారణం ఏమిటి? అని ప్రశ్నిస్తే చందమామ చెప్పిన సంగతులు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రొటీన్‌ గ్లామరస్‌ పాత్రల్లో నటించి బోర్‌ కొట్టేసింది. నటించేందుకు ఆస్కారం ఉన్న పాత్రలేవైనా నా వైపు వస్తేనే అంగీకరిస్తున్నా. కెరీర్‌ ఆరంభంలో అంటే కేవలం విజయం కోసమే నటించాల్సొచ్చేది. సక్సెస్‌ లేకపోతే అవకాశాలు రావు కాబట్టే అలా చేయాల్సొచ్చింది. కానీ ఇప్పుడు వేరు. వచ్చిన ప్రతిదీ అంగీకరించాల్సిన పనిలేదు అంటోంది కాజల్‌.

సెలక్టివ్‌గా నచ్చినవే ఎంచుకునే వెసులుబాటు వచ్చింది.. అని సూటిగా ఉన్న విషయాన్ని చెప్పింది. తప్పేం లేదు కెరీర్‌ ప్రారంభించి ఇప్పటికే 8ఏళ్లలో బోలెడంత సంపాదించేసింది. కోట్లకు కొదవేం లేదు. కాబట్టి ఇప్పుడు పేరు తెచ్చుకోవాలనుకోవడం తప్పేమీ కాదు. ఆల్‌ ది బెస్ట్‌ చందమామా!