Begin typing your search above and press return to search.

మరోసారి స్టార్ హీరో సరసన కాజల్..?

By:  Tupaki Desk   |   9 Jun 2021 11:30 PM GMT
మరోసారి స్టార్ హీరో సరసన కాజల్..?
X
బాలీవుడ్ హీరోలు సౌత్ సినిమాలు రీమేక్ చేయడం గురించి మనకు తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తెలుగు తమిళ మలయాళం కన్నడ సినిమాలు రీమేక్ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటున్నారు. తాజాగా స్టార్ హీరో అజయ్ దేవగన్ కొత్త రీమేక్ గురించి సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. 2019 తమిళ బ్లాక్ బస్టర్ 'ఖైదీ' మూవీ రీమేక్ చేయనున్నాడు అజయ్ దేవగన్. హీరో కార్తీ నటించిన ఈ ఫుల్ లెన్త్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్ ఖైదీ రీమేక్ హక్కులు దక్కించుకొని త్వరలో పట్టాలెక్కించే ప్రణాళిక రెడీ చేస్తున్నాడు. తమిళంలో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందించాడు.

అయితే పదేళ్లు తర్వాత ఖైదీగా విడుదలైన హీరో అంతవరకు కలవని పదేళ్ల కూతురును కలవడానికి వెళ్లే మార్గంలో ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. అయితే ఒరిజినల్ ఖైదీలో హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు. కేవలం హీరో గతంలో ఉన్నట్లుగా నేరేషన్ లో చెబుతారు. అయితే ఇప్పుడు హిందీ వెర్షన్ లో హీరోయిన్ క్యారెక్టర్ గురించి స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేస్తున్నారు. ఈసారి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇప్పుడే చూపించేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరినేది చర్చలు నడుస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఖైదీ రీమేక్ లో హీరోయిన్ క్యారెక్టర్ డెవలప్ చేస్తున్నారు. అయితే ఆ పాత్రలో మొన్నటివరకు కత్రినా కైఫ్ నేమ్ వినిపించింది. కానీ తాజాగా హీరో భార్య క్యారెక్టర్ సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్లే చేయనున్నట్లు టాక్. ఆల్రెడీ మేకర్స్ కాజల్ తో చర్చలు కూడా జరుపుతున్నారట. త్వరలోనే కాజల్ క్యారెక్టర్ పై అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే ఈ సినిమా ఓకే అయితే గనక అజయ్ దేవగన్ తో కాజల్ సెకండ్ మూవీ అవుతుంది. ఇదివరకు వీరి కాంబినేషన్ లో సింగం మూవీ తెరకెక్కి సూపర్ హిట్ అయింది. అయితే ఆ సినిమా కూడా తమిళ సింగం సినిమాకు రీమేక్ కావడం విశేషం. మరి ఈ పెయిర్ ఖైదీ సినిమాతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. ఈ సినిమాకు మిషన్ మంగల్ ఫేమ్ జగన్ శక్తి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ - మైదాన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాజల్ మెగాస్టార్ సరసన ఆచార్య - నాగ్ తో ఓ సినిమా చేస్తోంది.