Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్స్‌ సరసన నిలిచిన కాజల్‌

By:  Tupaki Desk   |   15 Jun 2021 8:30 AM GMT
ఆ హీరోయిన్స్‌ సరసన నిలిచిన కాజల్‌
X
కొన్నాళ్ల క్రితం వరకు హీరోయిన్స్ కు పెళ్లి అయితే పక్కన పెట్టేసేవారు. పెళ్లి అయిన హీరోయిన్స్ ను ఇండస్ట్రీ వారు అస్సలు పట్టించుకునే వారు కాదు. పెళ్లి అయ్యింది అంటే ఆ హీరోయిన్‌ కెరీర్ ఖతం అయినట్లే. ఒక్కరు ఇద్దరు మినహా గతంలో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ అంతా కూడా ఇంటికే పరిమితం అయ్యారు. కాని ఇప్పుడు కాలం మారింది.. పరిస్థితులు మారాయి.. హీరోయిన్స్ విషయంలో కూడా ప్రేక్షకుల మరియు ఫిల్మ్‌ మేకర్స్ ఆలోచన మారింది. పెళ్లి అయిన హీరోయిన్స్ ను కమర్షియల్‌ సినిమాల్లో నటింపజేయడంతో పాటు వారితో గ్లామర్ సీన్స్ ను కూడా చేస్తున్నారు. ఇటీవల కాలంలో పెళ్లి అయ్యి బిజీగా ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారి సరసన కాజల్‌ కూడా నిలిచింది.

బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఐశ్వర్య రాయ్.. కరీనా కపూర్‌.. సోనమ్‌ కపూర్‌.. విద్యాబాలన్‌ ఇంకా పలువురు హీరోయిన్స్‌ పెళ్లి తర్వాత కూడా బిజీగానే ఉన్నారు. ఇక టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత కూడా పెళ్లి తర్వాత బిజీగానే ఉంది. గత ఏడాది ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన హీరోయిన్‌ కాజల్‌ సినిమాల్లో అవకాశాలు దక్కించుకునేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని అనూహ్యంగా ఆమెకు బ్యాక్ టు బ్యాక్‌ వస్తున్నాయి. పెళ్లికి ముందు కమిట్‌ అయిన సినిమాలు మాత్రమే కాకుండా కొత్త ప్రాజెక్ట్‌ లు కూడా ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి.

కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తుంది. త్వరలోనే రాబోతున్న ఆ సినిమా కాకుండా ఇటీవలే వెబ్‌ సిరీస్ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా తమిళంలో ఒకటి మరియు హిందీలో ఒక సినిమా తెరకెక్కుతున్నాయి. తెలుగులో నాగార్జున.. ప్రవీణ్‌ సత్తారుల కాంబోలో ఈమె నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అది మాత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా ఈమె చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్‌. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా చందమామ బిజీగానే ఉంది.