Begin typing your search above and press return to search.

సంయుక్తకు మద్దతుగా నిలిచిన కాజల్‌

By:  Tupaki Desk   |   7 Sept 2020 8:20 PM IST
సంయుక్తకు మద్దతుగా నిలిచిన కాజల్‌
X
కన్నడం.. తెలుగు.. తమిళం భాషల్లో హీరోయిన్‌ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న నటి సంయుక్త హెగ్డే ఇటీవల బెంగళూరులోని ఒక పబ్లిక్‌ పార్క్‌ లో జాగింగ్‌ చేసి ఆ తర్వాత వర్కౌట్స్‌ చేస్తున్న సమయంలో అక్కడకు కవిత అనే ఒక సామాజిక కార్యకర్త వచ్చింది. సంయుక్తపై వాదనకు దిగింది. పబ్లిక్‌ ప్లేస్‌ ల్లో ఏంటీ ఈ రచ్చ అంటూ సంయుక్తపై కవిత చేయి చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆమెతో వచ్చిన వారు సంయుక్తపై దాడికి ప్రయత్నించారు. దాంతో వెంటనే స్పందించిన సంయుక్త తన మొబైల్‌ లో లైవ్‌ ఆన్‌ చేసి ఆ సంఘటన కవర్‌ చేయడంతో దాడి చేయకుండా వెనకడుగు వేశారు. సంయుక్త స్పోర్ట్స్‌ బ్రాతో పార్క్‌ లో అసభ్యంగా వర్కౌట్స్‌ చేయడం వల్లే ఆమెపై దాడి చేశామంటూ వారు పేర్కొన్నారు.

సంయుక్తపై దాడిని సినీ ప్రముఖులు పలువురు ఖండించారు. తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కూడా సంయుక్తకు మద్దతుగా నిలిచింది. ఓ మైగాడ్‌.. నేను ఇది నమ్మలేక పోతున్నాను. మీ కోపానికి కారణం ఏంటో తెలుసుకుని పరిష్కరించుకోండి. వేరే కారణాలతో చిరాకు పడి ఇతరులపై చూపించకండి. అమ్మాయిలకు ఎలాంటి డ్రస్‌ లు వేసుకోవాలో నలుగురిలో ఎలా ఉండాలో తెలుసు. సలహాలు ఇవ్వడం మానుకుని ఎవరి పని వారు చూసుకుంటే మంచిది అంటూ కాజల్‌ సామాజిక కార్యకర్త కవితకు సూచించింది.