Begin typing your search above and press return to search.
బాలయ్యకు రాణిగా చందమామ
By: Tupaki Desk | 16 April 2016 12:12 PM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా వందో సినిమాకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాన్ని చేయనున్నట్లు బాలకృష్ణ చెప్పేశారు. వచ్చే నెలలో షూటింగ్ కూడా ప్రారంభించుకోనుండడంతో.. మిగిలిన క్యాస్టింగ్, టెక్నీషియన్స్ ఎంపిక చకచకా జరుగుతోంది. ఈ మూవీలో బాలయ్య ఓ శాతవాహన మహారాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి రాజు అన్నాక రాణి కావాలి కదా.
అందుకే ఈ రోల్ కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకునేందుకు డైరెక్టర్ క్రిష్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే కాజల్ అగర్వాల్ రెండు సినిమాల్లో యువరాణిగా నటించిన కాజల్.. ఇప్పుడు మహారాణిగా ప్రమోషన్ అందుకోనుందన్న మాట. అయితే.. గత చిత్రాలతో పోల్చితే.. ఇది చరిత్రలో చాలా వెనుకకు వెళ్లాల్సి ఉంటుంది. క్రీ.శ. ఒకటో శతాబ్దానికి చెందిన స్టోరీ ఇది. అందుకే కాస్ట్యూమ్స్ సహా అనేక విషయాల్లో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే బాలకృష్ణ సరసన ఈ పాత్రలో కాజల్ అయితేనే బాగుంటుందని దర్శకుడు అనుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే కాజల్ కు ప్రతిపాదన అందగా.. ఈ చారిత్రాత్మక చిత్రం, బాలకృష్ణ కెరీర్ లో కీలకమైన మూవీలో తనకు ఆఫర్ రావడంపై కాజల్ సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రానికి చందమామ సైన్ చేయకపోయినా.. బాలయ్యకు మహారాణిగా కాజల్ ని ఖాయం చేసేసుకోవచ్చు.