Begin typing your search above and press return to search.

సమంత దారిలోనే కాజల్‌

By:  Tupaki Desk   |   7 Oct 2020 11:10 AM GMT
సమంత దారిలోనే కాజల్‌
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఈనెల 30వ తారీకున ప్రియుడు గౌతమ్‌ కుచ్లు ను వివాహం చేసుకోబోతుంది. కాజల్‌ పెళ్లి ప్రకటన ఆమె అభిమానులకు షాకింగ్‌ గా ఉంది. ఇప్పటికి కూడా పెళ్లి వార్తను నమ్మడం లేదు. చాలా మంది గతంలో వచ్చిన మాదిరిగా ఇవి కూడా పుకార్లేనేమో అనుకుంటున్నారు. కాని కాజల్‌ స్వయంగా తన పెళ్లి తేదీని ప్రకటించింది. ఇప్పుడు ఆమె పెళ్లి తర్వాత సినీ కెరీర్‌ గురించి చర్చ జరుగుతోంది. పెళ్లి తర్వాత కాజల్‌ నటిస్తుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతుంది. తాజాగా ఈమె ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాల్లో నటిస్తానంటూ పేర్కొంది.

సమంత పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు అయినా కూడా ఇంకా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే సమంత పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. పెళ్లి తర్వాత కాజల్‌ కూడా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు లేదంటే పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను చేసే అవకాశం ఉంది. కాజల్‌ అగర్వాల్‌ ఇప్పటి ఎక్కువగా హీరోలకు జోడీగా కమర్షియల్‌ సినిమాలనే చేస్తూ వచ్చింది. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కూడా చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమంతకు ఉన్నంత ప్లెక్సిబిలిటీ కాజల్‌ కు ఉంటుందా అంటే అనుమానమే అంటున్నారు. ఎందుకంటే నాగచైతన్యను పెళ్లి చేసుకుని హైదరాబాద్‌ లోనే సమంత సెటిల్‌ అయ్యింది. కాని కాజల్‌ పెళ్లి తర్వాత గౌతమ్‌ తో ముంబయిలో సెటిల్‌ అయ్యే అవకాశం ఉంది. మరి కాజల్‌ కు సినిమాల్లో కంటిన్యూ చేయడం సాధ్యం అవుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారందరికి సమాధానంగా తాను పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె ఆచార్య మరియు ఇండియన్‌ 2 సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాలు మరియు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటిస్తోంది.