Begin typing your search above and press return to search.

అజయ్ - కాజోల్ కి అంత కూతురుందా?

By:  Tupaki Desk   |   4 Oct 2016 4:31 AM GMT
అజయ్ - కాజోల్ కి అంత కూతురుందా?
X
బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ - మాజీ హీరోయిన్ కాజోల్ లది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. వీరికి ఒక కుమార్తె ఉందనేదీ తెలిసిందే, అయితే ఆ కుమార్తె ఇంత పెద్దదైపోయిందా? అని ఆశ్చర్యపోతున్నారట బీటౌన్ జనాలు. అదేంటి ఆ విషయం కొత్తగా తెలుసుకున్నారా అంటే? మిగతా స్టార్స్ పిల్లలు సాయింత్రం అయితే పబ్ లు - పార్టీలు అంటూ తిరిగుతూంటే అజయ్ పిల్లలు మాత్రం హై సర్కిల్స్ లో గానీ, పార్టీల్లో కానీ ఎక్కడా చూడలేదని బాలీవుడ్ జనాలు చెబుతున్నారట. అయితే రీసెంట్ గా అజయ్ దేవగన్ ఆయన కుమార్తె న్యాస తో కలిసి ఓ ఛారిటీ ఈవెంట్ కి వచ్చారు. అక్కడ తండ్రి, కుమార్తె కలిసి ఉండగా చూసిన జనం ఆశ్చర్యపోతూ - అజయ్ దేవగన్ ఇంత పెద్ద కుమార్తె ఉందా.. నిజమా.. అనటం వినిపించిందట.

అవ్వడానికి అజయ్ దేవగన్ - కాజోల్ లు సినిమా జనాలే అయినా వీరి ఫ్యామిలీ విషయాలు మాత్రం బాలీవుడ్ ప్రపంచానికి కూడా తెలియనంత సీక్రెట్ గా ఉంటాయ్ట. షి కెన్ ఫ్లై అనే ఈవెంట్ లో తాజాగా దర్శనం ఇచ్చిన న్యాస ఆ ఈవెంట్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. స్మైల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ క్యాంపైన్ లో ఆడపిల్లల ఆలోచనలు - ఆశయాలు - కలలును గుర్తించండం వంటి విషయాలపై జరిగింది. ఈ కాంపైన్ కు అజయ్ ఇలా తన కుమార్తె ని తీసుకొచ్చి సర్పైజ్ ఇచ్చారు.

అయితే, న్యాసా వయస్సు 13 సంవత్సరాలే అయినా, బాలీవుడ్ మీడియా మాత్రం ఆమె కూడా త్వరలో సినిమాల్లోకి రాబోతోదంటూ కథనాలు ప్రచురించిందట. ఇవన్నీ అజయ్ కొట్టిపారేస్తు, తన పిల్లలు నిజంగా సినిమా పరిశ్రమను ఎంచుకుంటే తను అభ్యంతరం చెప్పను కానీ ప్రస్తుతానికి వారి దృష్టంతా చదవుమీదే ఉందని స్పష్టం చేశారంట. కాగా, తన సొంత సినిమా ఫంక్షన్స్ కి కూడా అజయ్ తన పిల్లలను పెద్దగా తీసుకొచ్చింది లేదు!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/