Begin typing your search above and press return to search.
ఏమ్మా అముల్ బేబి? ప్లస్సవుద్దా?
By: Tupaki Desk | 28 July 2017 6:10 AM GMTఒక పక్కన చూస్తుంటే ఏదో రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నట్లు ఫీలింగ్. మరో ప్రక్కన చూస్తుంటే ఖచ్చితంగా రాంగ్ రూట్లో ప్రమోట్ చేస్తున్నారని అనిపించక మానదు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా 'విఐపి 2' సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తుంటే.. జనాలకు ఇలాంటి సందేహాలే వస్తున్నాయి. అసలు వాటికి కారణం ఏంటో చూద్దాం పదండి.
మామూలుగా మన సినిమాల్లో దాదాపు హీరో పేరునే ప్రముఖంగా పోస్టర్లపై కూడా ముద్రిస్తారు. ఇప్పుడు అదే తరహాలో ''ధనుష్ ఇన్.. విఐపి'' అంటూ గతంలో పోస్టర్లు చూశాం. కాని ఇప్పుడు మాత్రం.. ''ధనుష్ అండ్ కాజోల్ ఇన్.. విఐపి 2'' అంటూ పోస్టర్లపై ముద్రించారు. కట్ చేస్తే ఇదే ఇప్పుడు అనేక సందేహాలకు దారి తీస్తోంది. నిజానికి ఈ సినిమాలో కాజోల్ చేస్తోంది ఒక విలన్ క్యారక్టర్. అటువంటిది ఆమెను హీరోయిన్ తరహాలో ధనుష్ పక్కనే పోస్టర్లు వేసేసి.. అలాగే పోస్టరుపై ధనుష్ పేరుతో ఆమె పేరును కూడా రాస్తుంటే.. అది గౌరవం ఇస్తున్నట్లు అనుకోవాలా లేదంటే హీరోయిన్ అమలా పాల్ ను పక్కకు తప్పించి ఈమెను ప్రమోట్ చేస్తున్నట్లు అనుకోవాలా? అక్కడికి వీళ్ళిద్దరే రొమాంటిక్ పెయిర్ అన్నట్లున్న ఈ ప్రమోషన్ సినిమా విషయంలో అసలు ప్లస్సవుతుందంటారా?
ఇదంతా ఒకెత్తయితే.. సినిమాను డైరక్ట్ చేస్తోంది రజనీకాంత్ చిన్నకూతురు కాబట్టి.. ఇప్పుడు మలేషియాలో కూడా సినిమాను విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ కూడా పెద్ద పెద్ద వారిని కలసి.. ఇది రజనీ అల్లుడు సినిమా అంటూ రచ్చ చేస్తున్నారు. కబాలికే కంటెంట్ లేకపోతే వర్కవుట్ కాలేదు.. మరి ధనుష్ బాబుకు వర్కవుట్ అవుద్దా? ఏమ్మా అముల్ బేబి.. ఏమంటావ్?