Begin typing your search above and press return to search.

కాజోల్ మాధురి అంటే టూ మచ్చే

By:  Tupaki Desk   |   6 Feb 2018 5:32 AM GMT
కాజోల్ మాధురి అంటే టూ మచ్చే
X
ఓ సినిమా రిలీజ్ కు ముందు రకరకాల ఫీలర్లు బయటకు వస్తుంటాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన డీటైల్స్ చెప్పకుండానే.. సినిమాను ప్రచారం చేసుకునేందుకు మేకర్స్ కొన్ని టెక్నిక్స్ పాటిస్తుంటారు. అభిమానులు అత్యుత్సాహంతో మరికొన్ని విషయాలను కల్పించి మరీ ప్రచారం చేసేస్తుంటారు. ఇప్పుడు మోహన్ బాబు మూవీ గాయత్రి విషయంలో ఇదే జరిగినట్లు కనిపిస్తోంది.

ఈ నెల 9న గాయత్రి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు.. శ్రియ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ తో పాటు.. ప్రమోషన్స్ లోను శ్రియను బాగానే ప్రొజెక్ట్ చేశారు. విష్ణుతో పోల్చితే ఆమె కొంచెం సీనియర్ మాదిరిగా కనిపిస్తున్నా.. తన ట్యాలెంట్ తో ఆ విషయాన్ని కవర్ చేసేయడం శ్రియా శరణ్ కు కొత్తేమీ కాదు. ఆమెను ఈ పాత్రకు తీసుకోవాల్సిందిగా.. మంచు విష్ణు భార్య సూచించిందట. ఈ పాత్రకు పలువురిని పరిశీలించిన అనంతరం.. శ్రియను ఓకే చేశారట. అంతవరకూ ఓకే కానీ.. ఇప్పుడు మరో టాక్ బయల్దేరింది.

శ్రియ పోషించిన పాత్రకు మొదట బాలీవుడ్ సీనియర్ స్టార్స్ ను పరిశీలించారట. హిందీతో పాటే తమిళ్ లోనూ నటించిన కాజోల్.. డ్యాన్సింగ్ బ్యూటీ మాధురి దీక్షిత్ లను అప్రోచ్ అయ్యారని అంటున్నారు. శ్రియ పోషించిన పాత్ర చూస్తే.. అచ్చమైన తెలుగింటి మహిళ పాత్ర అనే సంగతి అర్ధమవుతూనే ఉంది. ఇలాంటి రోల్ కు కాజోల్.. మాధురి లాంటి సీనియర్లను అడిగారనే ప్రచారం మాత్రం కాస్త టూమచ్ గానే ఉందని చెప్పుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.