Begin typing your search above and press return to search.

ఆ స్టార్ బ్యూటీకి ఇంత అహంకారమా? ఒకటే తిట్టిపోస్తున్నారు!

By:  Tupaki Desk   |   7 Aug 2021 3:16 AM GMT
ఆ స్టార్ బ్యూటీకి ఇంత అహంకారమా?  ఒకటే తిట్టిపోస్తున్నారు!
X
అభిమానుల అభిమానం హద్దులంటూ ఏమీ ఉండవు. తమకు నచ్చిన సెలబ్రిటీ కోసం వారెంతగా తపిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. తమను అంతలా అభిమానిస్తున్న వారు సెలబ్రిటీల నుంచి ఆశించేది.. చక్కటి పలుకరింపు మాత్రమే. మరికాస్త అంటే.. ఒక ఫోటో అడుగుతారు.అంతకు మించి వారు ఆశించేది ఏమీ ఉండదు. కానీ.. ఈ చిన్న విషయాన్ని పట్టించుకోకుండా ఆటిట్యూడ్ చూపించి కొత్త తిప్పలు తెచ్చుకోవటం కొంతమంది సెలబ్రిటీలకు అలవాటే. తాజాగా అలాంటి సమస్యను తెచ్చి పెట్టుకున్నారు బాలీవుడ్ సీనియర్ స్టార్ నటి కాజోల్. అసలేం జరిగిందంటే?

ఈ మధ్యనే ఆమె తన 47వ పుట్టినరోజును జరుపుకున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో పరిమితంగా.. తనకు అత్యంత సన్నిహితుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ ను పూర్తి చేసుకుంది. ఆమె ఎంత పరిమితంగా సెలబ్రేషన్స్ ను చేసుకున్నప్పటికి ఆమెను అభిమానించే వారు ఊరుకుంటారా? పిల్లాజెల్లాను వేసుకొని ఆమె ఇంటి వద్దకు కేక్ పట్టుకొని వచ్చారు. ఆమె బయటకు వచ్చే వరకు వెయిట్ చేసేట్లుగా ఉండటంతో.. సెక్యురిటీ వారు కాజోల్ కు విషయాన్ని చెప్పారు. దీంతో ఆమె బయటకు వచ్చారు. ఇంటి గేటు బయటకు వచ్చి.. రోడ్డు మీదనే అభిమానుల్ని ఉంచేసి.. వారు తెచ్చిన కేక్ ను సింఫుల్ గా కట్ చేశారు.

ఆ మాత్రం దానికే అభిమానులు తెగ సంతోషపడిపోయారు. కాకుంటే.. వారో చిన్న కోరిక కోరారు. తాము తీసుకొచ్చిన కేక్ ముక్కను తినాలని కోరారు. అందుకు నో అంటే నో అనేసిన ఆమె.. ససేమిరా అంటూ లోపలకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై పలువురు ఆమెను తిట్టిపోస్తున్నారు. ఎంత స్టార్ అయితే మాత్రం మరీ అంత యాటిట్యూడా? అని తిట్టిపోస్తున్నారు. కాజోల్ కు అహంకారం ఎక్కువని.. అందుకే తనకు ఆమె మొదట్నించి నచ్చదని ఒకరు వ్యాఖ్యానిస్తే.. మరొకరు తమ గత అనుభవాల్నిప్రస్తావించటం గమనార్హం.

రీల్ లైఫ్ లో కాజోల్ కనిపించినట్లుగా రియల్ లైఫ్ లో కనిపించదని.. ఎంత హీరోయిన్ అయితే మాత్రం అంత పొగరు ఉండకూడదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అభిమానుల విషయంలో అభిమానాన్ని ప్రదర్శించాలే కానీ అహంకారాన్ని కాదన్న విషయాన్ని కాజోల్ ఎప్పటికి గ్రహిస్తుందో?