Begin typing your search above and press return to search.
మా అమ్మ బాత్రూమ్ కడిగించింది
By: Tupaki Desk | 12 Jan 2018 4:55 AM GMTవయసు పెరిగినా సొగసు తరగని బాలీవుడ్ బ్యూటీల్లో కచ్చితంగా కాజోల్ పేరు కూడా ఉంటుంది. అప్పట్లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో తన అందంతో ఎంతగా ఆకట్టుకుందో.. ఈమధ్య వచ్చిన దిల్ వాలే సినిమాలోనూ అంతే అందంగా ఉందని ప్రశంసలు దక్కించుకుంది. గోల్డెన్ స్పూన్ తో పుట్టి పెరిగినా.. తనకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ బాగా తెలుసని అంటోంది కాజోల్.
‘‘ప్రపంచంలో అన్ని పనులు గొప్పవేనని.. ఏ పనీ తక్కువ కాదనే విషయం చిన్నతనంలోనే మా అమ్మతనూజ తెలియజేసింది. నా చిన్నప్పుడు నాతోనే ఇల్లు ఊడవడం.. బాత్ రూమ్ లు శుభ్రం చేయడం చేసేది. ఒకవేళ ఇంట్లో సర్వెంట్లు లేకపోయినా నీ ఇంటి బాగోగులు నువ్వు చూసుకోగలగాలి అని చెప్పేది. మా అమ్మ నేర్పిన క్రమశిక్షణ పని పట్ల గౌరవాన్ని పెంచింది. ఎవరు చేసే పనితక్కువ కాదు. అందరినీ గౌరవంగా చూడాలనే విషయం తెలిసింది. మా పిల్లల గదిని కూడా శుభ్రం చేస్తుంటాను. దానివల్ల గదిని చెత్తగా చేయకూడదనే విషయం వారికీ అర్ధమవుతుందని’’ కాజోల్ చెప్పుకొచ్చింది.
అప్పట్లో ప్రభుదేవాతో మెరుపు కలలు మూవీలో సౌత్ సినిమాలో నటించిన కాజోల్ ఈమధ్య ధనుష్ హీరోగా నటించి విఐపి-2 మూవీలో కనిపించింది. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ లేటెస్ట్ సినిమా జీరో లో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసింది. షారూక్ ఖాన్ తో కలిసి నటించడం తనకు ఎప్పుడూ ఆనందమేనని.. 300 శాతం పాత్రకు న్యాయం చేయగల నటుడని షారూక్ కు కితాబిచ్చింది.