Begin typing your search above and press return to search.
ఇందుకే యాక్షన్ గన్ పడిపోయాడా?
By: Tupaki Desk | 27 Feb 2019 5:30 PM GMT`మెరుపు కలలు` సినిమాతో సౌత్ లో మెరుపులు మెరిపించిన బాలీవుడ్ బ్యూటీ కాజోల్. ఆ తర్వాత సౌత్ లో నటించేందుకు దశాబ్ధాలే పట్టింది. ఆ చిత్రంలో ప్రభుదేవా సరసన నటించిన కాజోల్ కుర్రకారు కలలరాణిగా వెలిగిపోయింది. ఆ అందానికి సౌత్ ఫిదా అయిపోయింది. నేటికీ కాజోల్ గుర్తుంది అంటే తను నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగో (ప్రేమించి పెళ్లాడుతా), ఆ తర్వాత మెరుపు కలలు చిత్రాలు యూత్ కి అంతగా కనెక్టవ్వడం వల్లనే. ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలోనూ కాజోల్ నటించి మెప్పించింది.
ప్రస్తుతం స్టార్ హీరో అజయ్ దేవగన్ భార్యగా సంసార జీవనంలో బిజీగా ఉన్న కాజోల్ కు తనంత ఎదిగేసిన కుమార్తె ఉంది. ఇటీవల తన కుమార్తె ఫోటోషూట్లు బయటపడుతుండడంతో తను కూడా నాయికగా తెరకు పరిచయం అవుతోందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అదంతా సరే.. కాజోల్ ఈ కొత్త లుక్ ఎక్కడిది? అంటే రీసెంట్ గా 20వ వెడ్డింగ్ యానివర్శరీ జరుపుకున్నారు కాజోల్ - అజయ్ జంట. ఆ సందర్భంలోని ఫోటో ఇది. సామాజిక మాధ్యమాల్లో ఇది జోరుగా వైరల్ అవుతోంది.
20వ వెడ్డింగ్ యానివర్శరీకి హార్ట్ ను టచ్ చేసే అద్భుతమైన సందేశాన్ని కాజోల్ తన భర్త అజయ్ దేవగన్ కి పంపించింది. నీకోసం నేను ఏం వండేది? నాకోసం నువ్వు ఏం వంటకం చేసావో తెలీదు.. నాకు మంచి ఫుడ్ ఆర్డర్ చెయ్.. అంటూ ఫ్యామిలీ లైఫ్ లో మాధుర్యాన్ని ఎలివేట్ చేస్తూ ఓ సంక్షిప్త సందేశాన్ని తన భర్త దేవగన్ కి పంపించింది కాజోల్. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఆనంద్ గాంధీ గుజరాతీ స్టేజీ డ్రామా `బేటా కాగ్డో` ఆధారంగా రూపొందుతున్న `తానాజీ- ది అన్ సంగ్ వారియర్` చిత్రంలో అజయ్ దేవగన్ - కాజోల్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.