Begin typing your search above and press return to search.
పుస్తకాలపై మాజీ హీరోయిన్ ఫీలవుతోంది
By: Tupaki Desk | 31 July 2017 10:03 AM GMTవిఐపి2 సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దమై మరో వారం రోజులలో విడుదలకాబోతుంది. ఈ సినిమాకు ప్రచారం కూడా ఇప్పుడు మీడియాలో బాగనే చేస్తున్నారు విఐపి2 టీమ్. తమిళ్ హీరో ధనుష్ హీరో గా నటిస్తున్న సినిమాలో బాలీవుడ్ మాజీ హీరోయిన్ కాజోల్ కూడా నటిస్తుంది. సౌందర్య రజినికాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజోల్ ప్రతినాయక పాత్రలో అలరిస్తుందట. ఈ సినిమా హిందీలో విడుదల చేయడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
కాజోల్ అందం గురించి ఆమె నటన గురించి తెలిసిన అభిమానులు కు ఆమె ఒక పుస్తకాల పురుగు అనే విషయం తెలిసి ఉండదు. ఆమె సన్నిహిత వర్గాలలో ఎవరిని అడిగిన చెబుతారు ఆమె ఎంతలా చదువుతుందో. పుస్తకాలు చదివే అలవాటు పై కాజోల్ మాట ఏంటంటే “నేను పుస్తకాలు చదవకుండా ఉండలేను నా దగ్గర ఇప్పుడు ఒక పెద్ద లైబ్రరి ఉంది తెలుసా. నేను ఈ మధ్యేనే నా పాత పుస్తకాలు అన్నీ ఒక లైబ్రరీగా మార్చి చదవటం మొదలుపెడుతున్నాను. నాకు కొంచెం బాధగా కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అందరూ పుస్తకాలు చదవటం మానేశారు. అందరూ పిడిఎఫ్ లు చదవటానికి అలవాటు పడ్డారు. ఈ రోజులలో ఎవరి చేతిలోను పుస్తకం కనిపించటంలేదు'' అని బాధపడిందీ సుందరి.
ఇప్పుడు ఏమి చదువుతున్నారు అని అడిగితే “నా రొమాంటిక్ నవలలు అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి చదవటం మొదలుపెట్టాను'' అని చెప్పింది. ఒక నిర్మాత గా ఏదైనా పుస్తకాన్ని సినిమాగా నిర్మించవచ్చు కదా అంటే “అన్ని మంచి పుస్తకాలు సినిమాలుగా తీయవచ్చు కానీ చాలా తక్కువ పుస్తకాలు మాత్రమే వెండి తెర పై చూడగలం అంటుంది. పైగా ఇప్పుడు హిందీ సినిమాలో అది సాధ్యపడటం కొంచెం కష్టం'' అని చెప్పింది. మొత్తానికి ఇప్పుడు ఖాళీ దొరినట్లు ఉంది కాజోల్ కి తన పాత పుస్తకాలు చదవడానికి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడు వెళ్ళిన ఒక పుస్తకం పట్టుకొని బయటకు వెళ్లిపోతోంది.