Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ కు రెండుసార్లు అబార్షన్లు

By:  Tupaki Desk   |   17 Feb 2020 5:00 AM IST
స్టార్ హీరోయిన్ కు రెండుసార్లు అబార్షన్లు
X
స్టార్ స్టేటస్ అందరికి సాధ్యమయ్యేది కాదు. అందునా ఒకే ఇంట్లో ఇద్దరు స్టార్లు ఉండటం.. వారిద్దరూ సినీ ప్రముఖులుగా ఉండటం చాలా రేర్. అలాంటి కాంబినేషన్ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్టార్ హీరోయిన్ కాజోల్ ది. వీరిద్దరూ పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ఇలాంటివేళ.. తమకు సంబంధించిన ప్రైవేటు విషయాలు చెప్పేందుకు ఇష్టపడరు. అందుకు భిన్నంగా తనకు సంబంధించినవి చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.

తన జీవితంలో ఆనందమే కాదు బాధకు సంబంధించిన అంశాలు ఉన్నాయని చెప్పింది కాజోల్. నాలుగేళ్లు అజయ్ తో డేటింగ్ చేసిన ఆమె.. తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తనకు రెండుసార్లు గర్భస్రావం జరిగినట్లుగా చెప్పారు. తన జీవితంలో అవే అత్యంత బాధాకరమైన రోజులుగా ఆమె చెప్పారు.

తమ హనీమూన్ తర్వాత కొన్నాళ్లకు పిల్లలు కావాలని అనుకున్నామని.. తొలిసారి కన్ఫర్మ్ అయిన తర్వాత కొద్ది రోజులకే గర్భస్రావమైనట్లు చెప్పింది. అలా రెండుసార్లు కావటంతో వేదనకు గురైనట్లు చెప్పింది. ఈ రెండు అనుభవాల తర్వాత వైద్యుల సలహాలు.. సూచనలు తీసుకొని వారి పర్యవేక్షణలో తల్లిని అయినట్లుగా చెప్పింది. ప్రస్తుతం కాజోల్ కు ఇద్దరు పిల్లలన్న విషయం తెలిసిందే.