Begin typing your search above and press return to search.
తన సీక్రెట్ క్రష్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 15 April 2020 1:30 AM GMT'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’తో కుర్రకారు మనసులను కొల్లగొట్టిన బాలీవుడ్ సుందరి కాజోల్. తన నటన, హవభావాలతో ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కెరీర్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలోనే నటుడు అజయ్ దేవగణ్‌ను 1999 ఫిబ్రవరి 24న వివాహం చేసుకుంది. 'గుండారాజ్' చిత్రంలో నటిస్తున్నపుడు 1994లో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఇద్దరికి సరైన జోడీ కాదని విమర్శలు వచ్చినా వాటిని లెక్కచేయకుండా వీరు ఒక్కటయ్యారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే, కాజోల్‌కు ఓ హీరో అంటే తెగ ఇష్టమట. ఆయనంటే క్రష్ ఉండేదట. ఆయన కనిపిస్తే చాలు సంబరపడిపోయేదట. ఆ హీరోనే బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్.
ఈ విషయాన్ని దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఓ టీవీ షోలో వెల్లడించారు. కరణ్ జోహార్, కాజోల్ మంచి స్నేహితులు. వీరిద్దరు తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజోల్‌కు సంబంధించిన ఈ రహస్యాన్ని బయట పెట్టారు. 'కాజోల్‌ను 'హెన్నా' సినిమా ప్రీమియర్‌లో కలిశా. అప్పటికి కాజోల్‌కు అక్షయ్ కుమార్ అంటే క్రష్ ఉండేది. అక్కడ ఆయన కనిపిస్తారేమో అని చాలాసేపు చూసింది. కానీ ఆయన కనిపించలేదు' అని వెల్లడించారు. ఆ సందర్భమే తమ ఇద్దరి మధ్య స్నేహానికి తొలిమెట్టు అని వ్యాఖ్యానించారు. తామిద్దరం దక్షిణ ముంబైలో నివసించేవాళ్లమని, దాంతో తమ స్నేహం మరింత బలపడిందని చెప్పాడు.
ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ 'ప్రీమియర్‌కు కరణ్ త్రీ పీస్ సూట్‌లో వచ్చాడు. ఆయన్ను చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయా. ఏ వ్యక్తి ఇలాంటి దుస్తులు వేసుకుంటాడు అని ఆశ్చర్యపోయా' అని కరణ్ డ్రెస్సింగ్ స్టైల్‌ను కాజోల్ వివరించారు. వెంటనే కరణ్ కల్పించుకుంటూ 'అప్పడు నాకు 17 ఏళ్లే. ఆ సూట్‌కు నేను సరిపోయా. అక్కడ నన్ను చూసి కాజోల్ దాదపు అరగంట పాటు నవ్వింది. అవమానంగా అనిపించడంతో పార్టీ నుంచి వెళ్లిపోయా' అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.