Begin typing your search above and press return to search.

తొలిప్రేమను చూపించేసిన కాజోల్

By:  Tupaki Desk   |   10 Nov 2017 5:20 AM GMT
తొలిప్రేమను చూపించేసిన కాజోల్
X
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్.. ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తోంది. వన్నె తరగని అనలేం కానీ.. వయసు పెరిగిన ఛాయలు కొంత కనిపిస్తున్నా.. ఇప్పటికీ తన ట్యాలెంట్ తో మెప్పిస్తోంది ఈ భామ. రెండు దశాబ్దాల క్రితం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే.. కుచ్ కుచ్ హోతా హై వంటి భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టి టాప్ గేర్ లో నిలిచిన కాజోల్.. ఆ తర్వాత అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

అప్పట్లో షారూక్-కాజోల్ మధ్య కుచ్ కుచ్ అనే టాక్ వినిపించేది కానీ.. ఈ తొలి ప్రేమ కథ అది కాదు. ప్రతీ గురువారం థ్రోబ్యాక్ పిక్స్ అంటూ అలనాటి జ్ఞాపకాలను షేర్ చేస్తుండడం ఈ మధ్య బాలీవుడ్ లో బాగా పెరిగింది. ఇందులో భాగంగానే తన తొలిప్రేమ అంటూ ఓ సూపర్బ్ ఫోటోను షేర్ చేసింది కాజోల్. ఇందులో ఓ కారు బంపర్ పై కూర్చుని.. రెండు చేతులు తలపై పెట్టి పోజ్ ఇచ్చిన యంగ్ కాజోల్ కనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈమె కొన్న మొదటి కారు ఇదే. ఎవరికైనా తన తొలి కారు అంటే అదో రకమైన మత్తు వచ్చేస్తుంది.

'నేనేం కనుగొన్నానో చూశారా.. నా తొలిప్రేమకు సంబంధించిన ఒక ఫోటో.. నా మొదటి కారు' అంటూ అలనాటి ఫోటోను షేర్ చేసింది కాజోల్. కుర్ర వయసులో కాజోల్ అందాలు.. మారుతి కారు.. మొత్తం మీద ఫోటో సూపర్బ్ గా ఉంది. ఇక రీసెంట్ గా ఈ సీనియర్ భామ నటించిన తమిళ్ మూవీ వీఐపీ2.. జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. నెగిటివ్ రోల్ ను కాజోల్ పండించేసినా.. నెరేషన్ వీక్ గా ఉండడంతో సినిమా అంతగా ఆడలేదు.