Begin typing your search above and press return to search.

ఫేడ‌వుట్ బ్యూటీ బికినీ పార్టీ చూశారా?

By:  Tupaki Desk   |   5 March 2020 5:07 AM GMT
ఫేడ‌వుట్ బ్యూటీ బికినీ పార్టీ చూశారా?
X
బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ ఇటీవల అడపాదడపా ప్ర‌యోగాత్మ‌క‌ పాత్రలతో ఆకట్టుకుంటోంది. ఇటీవల భర్త అజయ్‌ దేవగన్‌తో కలిసి `తానాజీ` చిత్రంలో నటించింది. అయితే ఆమెకి ఓ చెల్లి కూడా ఉన్న సంగతి తెలిసిందే. చెల్లి తనీషా ముఖర్జీ ఒకప్పుడు హీరోయిన్ గానూ నటించింది. తాజాగా ఆమె 42లోకి అడుగుపెట్టింది. ఇటీవలే మంగళవారం తన 42వ పుట్టిన రోజుని తన కుటుంబ సభ్యులు.. స్నేహితుల మధ్య గ్రాండ్‌గా జరుపుకుంది. తనీషాతో దిగిన ఒకప్పటి ఫొటోని.. బికినీ లో ఉన్న మరో ఫొటోని కాజోల్‌ ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా సోషల్‌ మీడియా లో అభిమానులతో పంచుకుంది.

తనదైన స్టయిల్లో సోద‌రికి పుట్టిన రోజు విషెస్ ని తెలిపింది. అందుకు తనీషా ప్రతి స్పందిస్తూ `థ్యాంక్యూ మై డార్లింగ్‌. లవ్‌ యూ టు సో మచ్‌` అని వెల్లడించింది. అయితే బికీనిలో తన స్నేహితులతో కలిసి ఓ రిసార్ట్ లో తనీషా ఇచ్చిన పోజులు ఆకట్టుకుంటున్నాయి. ఈ పుట్టిన రోజు చాలా స్పెషల్‌గా జరిగిందట. ఆ విషయాన్ని తనీషా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. బర్త్ డే రోజు ఇలా బికినీ లో పోజులివ్వడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.

కాజోల్‌- తనీషా ఇద్దరు దర్శక నిర్మాత శోము ముఖర్జీ- తనుజా సమర్త్ ల తనయలు అన్న సంగతి తెలిసిందే. తనీషా 2003లో ఎస్‌స్‌స్‌.. చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. 'సర్కార్‌', 'వన్‌ టూ త్రి', 'సర్కార్‌ రాజ్‌'తోపాటు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్‌ సరసన 'కంత్రి' చిత్రం లో నటించి ఆకట్టుకుంది. చివరగా ఆమె 2016లో వచ్చిన 'అన్న'లో నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఓ రకంగా సరైన అవకాశాలు లేక ఫేడౌట్‌ అయ్యిందనే చెప్పొచ్చు.