Begin typing your search above and press return to search.

ఆ నటుడి మరణంపై ఇంకా అనుమానాలే

By:  Tupaki Desk   |   12 Jun 2016 7:15 AM GMT
ఆ నటుడి మరణంపై ఇంకా అనుమానాలే
X
దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ పరిచితమైన నటుడు కళాభవన్ మణి. ఈ యాక్టర్ హఠాన్మరణం అన్ని ఇండస్ట్రీలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన మృతి కేసు ఇప్పుడు సీబీఐ దగ్గరకు చేరనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన కేరళ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రాష్టర్ హోమ్ సెక్రటరీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చ్ 6న ఈ నటుడు లివర్ కు సంబంధించిన వ్యాధితో కొచ్చిలోని హాస్పిటల్ లో జాయిన్ కాగా.. అక్కడే మరణించాడు

కళాభవన్ మణి మృతిపై అనుమానాలు వెలిబుచ్చుతూ సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు గతంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మణి మరణం సహజం కాదని వారు ముందునుంచీ అంటున్నారు. దీనికి అనుగుణంగానే ల్యాబ్ రిపోర్టులు కూడా రావడం గమనార్హం. మణి శరీరంలో ఎక్కువగా టాక్సిక్ మీథైల్ ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నాయని.. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ తేల్చి చెప్పింది.

గతంలో క్లోరోపైరిఫాస్ ఉందని ఓ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినా.. హైద్రాబాద్ కు చెందిన సీఎఫ్ ఎస్ ఎల్ ఈ అంశాన్ని తోసిపుచ్చింది. పరిమితికి మించి ఉన్న మీథైల్ ఆల్కహాల్ కారణంగానే మణి మరణం సంభవించిందని తేల్చి చెప్పింది. ఇప్పుడు కేసు సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. మణి మృతిపై అనుమానాలు బలపడుతున్నాయి.