Begin typing your search above and press return to search.

'క‌ళైమామ‌ణి' ఎవ‌రెవ‌రు తంబీ?

By:  Tupaki Desk   |   1 March 2019 9:55 AM IST
క‌ళైమామ‌ణి ఎవ‌రెవ‌రు తంబీ?
X
త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌క‌టించే క‌ళైమామ‌ణి పుర‌స్కారాలు ఎవ‌రెవ‌రికి ద‌క్కాయి? 2011 నుంచి 2018 వ‌ర‌కూ వ‌రుస‌గా ఏడు సంవ‌త్స‌రాల‌కు సంబంధించిన పుర‌స్కారాల్ని ఒకేసారి ప్ర‌క‌టించ‌డంతో కోలీవుడ్ లో ఒక‌టే సంద‌డి నెల‌కొంది. ఈసారి పుర‌స్కారాల్ని ద‌క్కించుకున్న వారి జాబితాలో హీరోలు ప్ర‌భుదేవా - కార్తీ - విజ‌య్ సేతుప‌తి ఉన్నారు. బాషా వంటి సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు సురేష్ కృష్ణ‌ - అగ్ర నిర్మాత ఏ.ఎం.ర‌త్నం - యువ సంగీత ద‌ర్శ‌కుడు యువ‌న్ శంక‌ర్ రాజా - గ్రేట్ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు - ద‌ర్శ‌కుడు హ‌రి ఉన్నారు. వీళ్ల‌తో పాటే క‌థానాయిక‌ల్లో ప్రియ‌మ‌ణి - క‌మెడియ‌న్ల‌లో సంతానం పేర్లు అవార్డుల జాబితాలో క‌నిపించాయి.

ప్ర‌స్తుతం అవార్డ్ గ్ర‌హీత‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇండ‌స్ట్రీ ప్రముఖులు స‌హా అభిమానులు శుభాకాంక్ష‌ల‌తో అభినందిస్తున్నారు. అస‌లింత‌కీ వీళ్లు అలాంటి అత్యున్న‌త పుర‌స్కారానికి అర్హులేనా? అని ప్ర‌శ్నిస్తే నిస్సందేహంగా అర్హత ఉన్న‌వారినే ఎంపిక చేసార‌ని ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. సీనియ‌ర్ ద‌ర్శ‌కులు - నిర్మాత‌ల‌కు - హీరోలు - సంగీత ద‌ర్శ‌కుల‌కు స‌ముచిత‌ గౌర‌వం ద‌క్కింది.

హీరోలు కార్తీ - విజ‌య్ సేతుప‌తి ప్ర‌తిభ విష‌యంలో ఏమాత్రం త‌క్కువ కాదు. ఇక త‌న‌వైన సుస్వ‌రాల‌తో ఇళ‌యరాజా వార‌సుడిగా యువ‌న్ శంక‌ర్ రాజా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఏల్తున్నాడు. తెలుగు వారికి అత‌డి ట్యూన్స్ పిచ్చిగా న‌చ్చేస్తాయి. ర‌త్న‌వేలు కెమెరా ప‌నిత‌నానికి ఎన్నో ఎగ్జాంపుల్సు ఉన్నాయి. ఎంథీర‌న్ చిత్రానికి బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ గా అవార్డులు అంద‌కున్నారు. ఇప్ప‌టికే అత‌డు ఫిలింఫేర్‌ లు - విజ‌య్ అవార్డ్స్ వంటివి అందుకున్నారు. అందుకే అత‌డు అత్యున్న‌త పుర‌స్కారం క‌ళైమామ‌ణికి అర్హుడు అన్న మాటా వినిపిస్తోంది. ఇక ద‌ర్శ‌కులు సురేష్ కృష్ణ‌ - హ‌రి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని సౌత్ ఇండ‌స్ట్రీకి అందించారు. త‌మ‌కంటూ ఓ బాణి ఉంద‌ని నిరూపించిన మేటి ద‌ర్శ‌కుడు. సంతానం స‌మ‌కాలీన క‌మెడియ‌న్ల‌లో ది బెస్ట్ అన్న‌ పేరు తెచ్చుకున్నారు. అత‌డికి అటు త‌మిళ‌నాడుతో పాటు ఇటు తెలుగునాటా అభిమానులు ఉన్నారు. అందుకే టాలీవుడ్ నుంచి స‌ద‌రు అవార్డీల‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.