Begin typing your search above and press return to search.
కాళికేయ కామెడీ ఎంటని విమర్శలు
By: Tupaki Desk | 11 July 2015 6:33 AM GMTరాజమౌళి క్రియేట్ చేసే విలన్లు అరివీర భయంకరంగా ఉంటారు. కర్కశులై వికృతంగా విరుచుకుపడడం, వెరైటీ ఆయుధంతో దాడులు చేయడం చేస్తుంటారు. హీరోని మించి విలనీ చూపించడం రాజమౌళికే చెల్లింది. అందుకే అతడు ఓ విలన్‌ని క్రియేట్ చేశాడంటే దానిపై బోలెడంత చర్చ సాగుతుంది. బాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్‌ని టాలీవుడ్‌లో టాప్ విలన్‌ని చేసింది జక్కన్న క్రియేటివిటీనే.
ఇటీవలి కాలంలో ఓ తెలుగు విలన్‌ని జక్కన్న పదే పదే ప్రమోట్ చేస్తున్నాడు. అతడు ఏ సినిమా చేసినా అందులో విలన్స్‌కు బీభత్సమైన స్ట్రెంగ్త్ ఉంటుంది. మార్యాద రామన్నతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ప్రభాకర్.. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ముఖ్యంగా బాహుబలి చిత్రంలో అతడు పోషించిన కాళికేయ పాత్ర సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. రాక్షస సంతతికి చెందిన వీరుడిగా కాళికేయ పాత్రను చూపించాడు రాజమౌళి. అయితే ఈ పాత్ర చేత చెప్పించిన 'కిళికి' అనే కొత్తరకం భాష థియేటర్‌లో జనాలకు విపరీతంగా నవ్వులు తెప్పించింది. పిల్లా పాపలు సైతం ఆ క్యారెక్టర్ సంభాషణల్ని విని నవ్వు ఆపుకోలేని పరిస్థితి.
హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి ప్రయోగాలు కనిపించేవి కానీ, ఈసారి జకన్న కూడా ఓ అడుగు ముందుకు వేసి ఇలాంటి ఓ కొత్త భాషని కనిపెట్టి ప్రయోగించాడు. అయితే ఇది మిస్ ఫైరైందని, అంతటి సీరియస్ వార్ ఎపిసోడ్‌లో ఇదేం కామెడీ అని విమర్శించే వాళ్లు ఉన్నారు. దీనిపైనా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.