Begin typing your search above and press return to search.
కాలకేయుడి వీడియో చూపిస్తేనే అనుమతించారట
By: Tupaki Desk | 4 April 2017 10:22 AM GMT‘బాహుబలి: ది బిగినింగ్’ లాంటి మెగా మూవీలో కాలకేయ పాత్రతో ప్రభాకర్ ఎలాంటి గుర్తింపు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాత్రతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు ప్రభాకర్. ఓసారి ఎయిర్ పోర్టులో ఇబ్బంది తలెత్తితే కాలకేయ వీడియో చూపించి దాన్నుంచి బయటపడ్డాడట ప్రభాకర్.
‘‘కాలకేయ క్యారెక్టర్ తో నాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టారు రాజమౌళి గారు. ఉత్తరాదిన కూడా నాకు గుర్తింపు వచ్చింది. ఎక్కడికెళ్లినా నన్ను ప్రభాకర్ అనట్లేదు. కాలకేయ అనే అంటున్నారు. ఆ మధ్య ఢిల్లీ ఎయిర్ పోర్టులో పాస్ పోర్ట్ టైం అయిపోయింది.. ఇక అనుమతించమని చెప్పారు. ఐతే నేను సినిమా నటుడినని చెప్పి.. బాహుబలి సినిమాలో కాలకేయుడిని నేనేనంటూ వీడియో చూపించాను. వాళ్లు ఆశ్చర్యపోయి నన్ను అనుమతించారు’’ అని చెప్పాడు ప్రభాకర్.
ఐతే కాలకేయ పాత్ర అంత గుర్తింపు తెచ్చినప్పటికీ తన ఫేవరెట్ మాత్రం ‘మర్యాదరామన్న’లోని బైరెడ్డి క్యారెక్టరే అని చెప్పాడు ప్రభాకర్. తనకు నటుడిగా మొదట గుర్తంపు వచ్చింది ఆ సినిమాతోనే కాబట్టి అదే తన ఫేవరెట్ అని చెప్పాడు ప్రభాకర్. ఆ సినిమాతో తనకు లైఫ్ ఇచ్చారన్న కృతజ్నతతో తన పెద్ద కొడుక్కి రాజమౌళి.. ఆయన సతీమణి రమ పేర్లు కలిసొచ్చేలా ‘శ్రీరాం రాజమౌళి’ అని పేరు పెట్టుకున్నట్లుగా ప్రభాకర్ చెప్పడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/