Begin typing your search above and press return to search.
విజువల్స్ వావ్ కానీ - టీజర్ టాక్
By: Tupaki Desk | 12 March 2019 10:33 AM GMTబాలీవుడ్ లో ఈ ఏడాదివస్తున్న అత్యంత భారీ ప్రాజెక్ట్స్ లో ఒకటి కళంక్. కరణ్ జోహార్ తో మరో ముగ్గురు అగ్ర నిర్మాతలు అసోసియేట్ అవుతూ తీసిన ఈ మల్టీ స్టారర్ కు అభిషేక్ వర్మన్ దర్శకుడు. దీని ట్రైలర్ ఇందాక విడుదల చేశారు. కథ ఎక్కువ రివీల్ చేయకుండా కేవలం విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు రిచ్ నెస్ ని హై లైట్ చేసే ప్రయత్నం గట్టిగా చేశారు. అర్థమైనంత వరకు కథ విషయానికి వస్తే ఇది ఇప్పటి చరిత్ర కాదు.
ఎప్పుడో స్వతంత్రం రాక ముందు ఓ రాజుల వంశానికి చెందినది. అనగనగా ఒక పెద్ద రాజ భవనం. దానికో చక్రవర్తి. మహారాణి ఉంటుంది. రాకుమారి తో పాటు యువరాజు కూడా కొలువుంటాడు. ఏదో కుట్ర. ఏదో సంఘర్షణ. బయటికి కనిపించని అంతర్యుద్ధంతో లోపల దావనలం మొదలవుతుంది. అంతు చిక్కని మలుపులతో వీళ్ళ జీవితాలకు కఠిన పరీక్ష ఎదురవుతుంది. అసలు ఏం జరిగింది ఎవరు ఎందుకు కళంకితులు అయ్యారనేదే అసలు కథ
ట్రైలర్ ఆసాంతం భారీతనం కొట్టొచ్చినట్టు కనపడింది. రాజీ ప్రస్తావనే లేకుండా సబ్జెక్టు డిమాండ్ చేసినంత మేర ఖర్చు పెట్టారు. సంజయ్ దత్-మాధురి దీక్షిత్-వరుణ్ ధావన్- అలియా భట్-సోనాక్షి సిన్హా-ఆదిత్య రాయ్ కపూర్ ఇలా మోస్ట్ వాంటెడ్ స్టార్లందరూ రిచ్ నెస్ ని తీసుకొచ్చారు. హంగామా బాగుంది కాని అసలైన ఫీల్ ని మాత్రం ఇందులో కలిగించలేక పోయారు. స్లోగా డల్ గా అనిపించే మూడ్ లో ట్రైలర్ కట్ చేయడం వెనుక వేరే ఉద్దేశం ఏమైనా ఉందేమో.
గ్లాడియేటర్ బాహుబలి తరహలో వరుణ్ ధావన్ ఓ కాకలు తీరిన దున్నపోతుతో పోరాడే సన్నివేశం తప్ప ఇంకే యాక్షన్ ఎపిసోడ్స్ ని చూపించలేదు. ఇది ఎక్కువ శాతం ఎమోషన్స్ మీద ఆధారపడి తీసినట్టు ఉంది. అంచనాలు అమాంతం పెంచేలా లేకపోయినా ఫైనల్ గా పర్వాలేదు అనిపించేలాగే ఉంది. తొలుత ఫిక్స్ చేసిన ఏప్రిల్ 19 కాకుండా రెండు రోజులు ముందుకు జరిపి ఏప్రిల్ 17న కళంక్ విడుదల కానుండటం విశేషం