Begin typing your search above and press return to search.
కళాపురం టీజర్.. ఈ ఊర్లో అందరు కలకారులే
By: Tupaki Desk | 6 Aug 2022 7:47 AM GMTటాలెంటెడ్ దర్శకుడు కరుణ కుమార్ 2020లో పలాస 1978 అనే సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమై విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి రా సినిమా చూసిన అనంతరం ప్రేక్షకులే కాదు, సెలబ్రెటీలు కూడా ఆశ్చర్యపోయారు.
ఆ తరువాత కరుణ కుమార్ 'శ్రీదేవి సోడా సెంటర్' అనే మరో విలేజ్ బ్యాక్ డ్రాప్ మాస్ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి థ్రిల్ చేసాడు. ఇక ఇప్పుడు సరికొత్తగా టాలెంటెడ్ నటీనటులులతో సిట్యుయేషనల్ కామెడీ డ్రామా 'కళాపురం'తో రెడీ అయ్యాడు.
ఆర్4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్ సమర్పిస్తోంది.
ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. టీజర్ కంప్లీట్ గా కామెడీ జానర్ లో హైలెట్ అయ్యింది. వినోదభరితమైన టీజర్ టైటిల్ కు "ఈ ఊర్లో అందరు కలకారులే" అనే క్యాప్షన్‌ను జస్టిఫై చేసింది.
ఒకప్పుడు క్యారెక్టర్ కమెడియన్స్ గా మంచి క్రేజ్ అందుకున్న సత్యం రాజేష్, చిత్రం శ్రీను సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చమత్కార కథలో ప్రధాన పాత్రలన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక ఊరిలో సినిమా చేయాలని అనుకున్న యువకుడు ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది.. అనే కాన్సెప్ట్ తో సినిమా రానున్నట్లు అర్ధమవుతోంది. ఇక టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కరుణ కుమార్ సిట్యుయేషనల్ కామెడీతో సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు.
సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ అట్లూరి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించారు. కరుణ కుమార్ తన గత రెండు చిత్రాల కంటే భిన్నంగా కాళాపురం చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక డిఫరెంట్ మూవీస్ ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఆచార్య సినిమా అనంతరం మణిశర్మ నుంచి ఇలాంటి చిన్న సినిమా రావడం విశేషం. మరి కళాపురం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.