Begin typing your search above and press return to search.

క‌ళాపురం బేబి.. కొత్త‌ బాటిల్లో పాత‌ వైన్ లాగా..!

By:  Tupaki Desk   |   8 Aug 2022 4:34 PM GMT
క‌ళాపురం బేబి.. కొత్త‌ బాటిల్లో పాత‌ వైన్ లాగా..!
X
'ప‌లాస' లాంటి నేటివిటీ ట‌చ్ ఉన్న రా ర‌స్టిక్ సినిమాతో ఆక‌ట్టుకున్నాడు క‌రుణ‌కుమార్. 2020లో ప‌లాస -1978 విడుద‌లై విజ‌యం సాధించింది. ఈ సినిమాలో శ్రీ‌కాకుళం భాష యాస‌తో పాత్ర‌ల‌ను తీర్చిదిద్దిన తీరు ఆక‌ట్టుకుంది.

రా మెటీరియ‌లిస్టిక్ మాస్ చిత్రంగా వ‌చ్చినా ఇది క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత కూడా కరుణ కుమార్ 'శ్రీదేవి సోడా సెంటర్' లాంటి విలేజీ నేప‌థ్య చిత్రంతో మెప్పించాడు. తాజాగా అంద‌రూ క‌మెడియ‌న్ల‌తో కామెడీ డ్రామా 'కళాపురం'ని తెర‌కెక్కించారు.

ఇటీవల విడుదల చేసిన మూవీ ఫస్ట్ లుక్ ఆక‌ట్టుకుంది. టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ ద‌క్కింది.

ఈ ఊర్లో అందరు కలకారులే అనే క్యాప్షన్ కి త‌గ్గ‌ట్టే ఈ మూవీ కంటెంట్ కూడా కామెడీ టింజ్ తో ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ బేబి.. అంటూ సాగే స్పెష‌ల్ మాస్ సాంగ్ విడుద‌లైంది.

పాట ఆద్య‌తం మైమ‌రిపించే డ్యాన్సింగ్ డాళ్ విన్యాసాల‌తో ర‌క్తి క‌ట్టించారు. పాట బాణీకి తగ్గ‌ట్టే హుషారైన స్టెప్పుల‌తో డ్యాన్సింగ్ గాళ్స్ మైమ‌రిపించారు. క‌ళాపురం బేబి.. కొత్త‌ బాటిల్లో పాత‌ వైన్ లాగా..! లిరిక్ అదిరింద‌య్యా సామీ అంటూ కుర్రాళ్లు జోష్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

కమెడియ‌న్ సత్యం రాజేష్... చిత్రం శ్రీను .. రక్షిత్ అట్లూరి.. పూన‌చ త‌దిత‌రులు ఇందులో తారాగ‌ణం. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఆర్ 4 ఎంటర్ టైన్మెంట్స్ ప‌తాకంపై రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. కరుణ కుమార్ తన గత రెండు చిత్రాల కంటే భిన్నంగా కాళాపురం చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది.