Begin typing your search above and press return to search.
వీడియో : మరోసారి సర్కారు వారి 'పాట'తో సిద్ మ్యాజిక్ రిపీట్
By: Tupaki Desk | 13 Feb 2022 11:06 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ సినిమాకు సంగీతాన్ని థమన్ అందిస్తున్న విషయం తెల్సిందే. రేపు వాలెంటైన్స్ డే సందర్బంగా కళావతి అంటూ మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లుగా నెల రోజుల క్రితమే ప్రకటించారు. గత వారం రోజులుగా సినిమా హడావుడి పీక్స్ లో ఉంది.
సినిమా నుండి పాట అదుగో ఇదుగో అంటూ తెగ సోషల్ మీడియా చర్చ జరిగింది. పాట విడుదలకు కొన్ని గంటలు ఉందని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా పాట లీక్ అయ్యింది. దాంతో ఒక రోజు ముందే పాటను యూట్యూబ్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడటం తో మొదటి నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. పాట విడుదల అయిన తర్వాత సిద్ మరోసారి తన మ్యాజిక్ ను రిపీట్ చేశాడంటూ కామెంట్స్ వస్తన్నాయి.
థమన్ ఈ మద్య కాలంలో స్టార్ హీరోల సినిమాల పాటలంటే ప్రాణం పెట్టి మరీ మ్యూజిక్ ఇస్తున్నాడు. కేవలం మ్యూజిక్ ఇవ్వడం మాత్రమే కాకుండా లిరికల్ వీడియో కోసం చాలా కష్టపడుతున్నాడు. ఏదో తూతూ మంత్రంగా పాటను విడుదల చేయకుండా ది బెస్ట్ ఔట్ పుట్ వచ్చే విధంగా విజువల్స్ ను కూడా ఆయన సమకూర్చుతున్నాడు. కళావతి సాంగ్ సింగర్ సిద్ మరియు థమన్ లు ఈ లిరికల్ వీడియోలో సందడి చేశారు.
థమన్ గత సూపర్ హిట్ పాటల మాదిరిగానే ఈ పాటతో కూడా వావ్ అనిపించాడు. ప్రతి ఒక్క మహేష్ బాబు ఫ్యాన్ కూడా కళావతి అంటూ జపించేలా థమన్ ఈ పాటను ట్యూన్ చేశాడు. మంచి ట్యూన్ కు అద్బుతమైన సిద్ గాత్రం తోడు అవ్వడంతో పాట లెవల్ బాగా పెరిగి పోయింది అనడంలో సందేహం లేదు.
ఇక ఈ పాట విదేశీ డాన్సర్స్ తో విదేశాల్లో చిత్రీకరణ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన విజువల్స్ ముఖ్యంగా మహేష్ బాబు డాన్స్ ఇంకా కీర్తి సురేష్ బ్యూటీ విదేశీ అందాలు ఇలా ఈ పాటలో ప్రతి ఒక్కటి కూడా ప్రధాన ఆకర్షణ అన్నట్లుగానే ఉన్నాయి. ఈ పాట సినిమా పై హైప్ పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషించబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మే 12న విడుదల కాబోతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది.
అతి త్వరలోనే సినిమా కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. ఆ వెంటనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మరింత జోరు పెంచుతారు. సినిమా నుండి మరిన్ని పాటలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. సిద్ శ్రీరామ్ పాటలు పాడిన సినిమాలు ఈమద్య కాలంలో ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. కనుక ఆ సెంటిమెంట్ కూడా రిపీట్ అయ్యి సర్కారు వారి పాట సూపర్ హిట్ అవుతుందేమో అంటూ అభిమానులు ఆశ పెంచుకుంటున్నారు.