Begin typing your search above and press return to search.

ఎక్కడ చూసినా 'కళావతి' నామస్మరణమే!

By:  Tupaki Desk   |   18 Feb 2022 5:37 AM GMT
ఎక్కడ చూసినా కళావతి నామస్మరణమే!
X
మహేశ్ బాబు అభిమానులంతా ఇప్పుడు 'సర్కారువారి పాట సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. 'భరత్ అనే నేను' .. 'మహర్షి' .. 'సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత ఆయన చేస్తున్న సినిమా ఇది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ - 14 రీల్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేశ్ బాబు కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన పాటల్లో 'కళావతి .. కళావతి' అనే పాటను ఇటీవల రిలీజ్ చేయగా, 4 రోజుల్లోనే 26 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా ఈ పాట వ్యూస్ పరంగా .. లైక్స్ పరంగా తన జోరును కొనసాగిస్తూనే ఉండటం విశేషం.

ముఖ్యంగా ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఎక్కడ ఏ స్కూల్ .. ఏ కాలేజ్ క్లాస్ రూమ్స్ లో చూసినా అక్కడ షికారు చేస్తూ కనిపిస్తోంది. ఈ పాటను స్టూడెంట్స్ భవిష్యత్తుకు ముడిపెడుతూ .. 'సరస్వతీ .. సరస్వతీ' అని పాడుకుంటే, ఒక వెయ్యో .. ఒక లక్షో అన్నట్టుగా శాలరీలు వచ్చే ఉద్యోగాలు వస్తాయని చెప్పే క్లాస్ రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాశాడు. ప్రేమగీతాలను రాయడంలో అనంత్ శ్రీరామ్ కి మంచి నైపుణ్యం ఉంది. ఈ తరహా పాటల్లో ఆయన కలం తిరిగిన రైటర్. తేలికైన పదాలతో ఆయన చేసిన పద ప్రయోగాలు .. తమన్ ట్యూన్ .. సిద్ శ్రీరామ్ ఆలాపన ఈ మూడూ కూడా అందరూ ఈ పాటను హమ్ చేసుకునేలా చేస్తున్నాయి. కథలో సందర్భాను సారంగా తెరపై ఈ పాట వచ్చినప్పుడు ఆ కిక్కు ఇంకా ఎక్కువగా ఉంటుందని మహేశ్ బాబు అభిమానులు భావిస్తున్నారు. మహేశ్ బాబు కెరియర్లోని హిట్ సాంగ్స్ జాబితాలో ఈ పాట చేరిపోయిందనే చెప్పాలి.

మహేశ్ జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇది. అందువలన ఈ జంటను తెరపై చూడటానికి అందరూ కూడా ఎంతో కుతూహలంతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సముద్రఖని నటిస్తున్నాడు. ఆయన విలనిజం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

ఇక మహేశ్ బాబు - వెన్నెల కిశోర్ కాంబినేషన్లోని కామెడీ కూడా ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మే 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.