Begin typing your search above and press return to search.
17 యేళ్ళు అయినా షారూఖ్ ను క్షమించడం లేదు
By: Tupaki Desk | 23 Nov 2018 5:07 PM GMTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా అభిమానులు ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని ఒడిశా ప్రజలు మాత్రం షారుఖ్ ను గత 17 ఏళ్లుగా ద్వేషిస్తూనే ఉన్నారు. తాజాగా ఒడిశాలో జరుగబోతున్న హాకీ ప్రపంచ కప్ పోటీల ప్రారంభోత్సవంకు షారుఖ్ వెళ్లాలని భావిస్తే అక్కడి ప్రజలు మొత్తం కూడా షారుఖ్ రాకను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఒడిశాలో క్షమాపణలు చెప్పకుండా అడుగు పెడితే మాత్రం తీవ్రంగా అవమానించి మరీ పంపిస్తామని షారుఖ్ కు హెచ్చరికలు జారీ చేశారు.
ఒడిశా ప్రజలు షారుఖ్ పై మరీ ఇంత ఆగ్రహంతో ఎందుకు ఉన్నారంటే.. ఒడిశా ప్రజలు అశోకున్ని ఆరాధిస్తారు. ఆయన్ను ఎంతగానో గౌరవిస్తారు. అలాంటి అశోకుడి గురించి షారుఖ్ మూవీ ‘అశోక’లో తప్పుగా చూపించారని - అశోక మూవీలోని కలింగయుద్దంను వక్రీకరించి చూపించారని - అశోకుడి గురించి వ్యతిరేకంగా ఆ చిత్రంలో చూపించారంటూ అప్పట్లో మూవీని ఒడిశాలో బ్యాన్ చేసే వరకు ఆందోళనలు చేశారు. అప్పటి నుండి కూడా అశోకుడిని అవమానించినందుకు గాను షారుఖ్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా క్షమాపణలు చెబితేనే తమ రాష్ట్రంలో అడుగు పెట్టాలని ఒడిశా ప్రజలు అంటున్నారు. తమ సంస్కృ తిని సాంప్రదాయాలను అవమానించిన వ్యక్తి తమ రాష్ట్రానికి వస్తే ఎలా ఊరుకుంటామని ప్రజా సంఘాల వారు ఆగ్రహంతో ఉన్నారు. మరి షారుఖ్ క్షమాపణలు చెప్పి ఒడిశాలో అగుడు పెడతాడా లేదంటే, భారీ భద్రత మద్య ఒడిశాలో పర్యటిస్తాడో చూడాలి.