Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్ పార్టీలో ఆ మాత్రం రెచ్చిపోవాలిలే

By:  Tupaki Desk   |   11 Jun 2016 5:30 PM GMT
ప్రొడ్యూసర్ పార్టీలో ఆ మాత్రం రెచ్చిపోవాలిలే
X
బాలీవుడ్ లో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్.. ఇప్పుడు ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకుంది. గ్రాండ్ లెవెల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి బోలెడంత మంది సెలబ్రిటీలు విచ్చేశారు. ఈ తరం టెక్నీషియన్లు - యాక్టర్లతో పాటు పలువురు సీనియర్లు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే.. ఈ ప్రోగ్రాంలో ఎంతమంది ఉన్నా.. కల్కి కొచ్లిన్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పేరుకు ఇండియన్ అయినా.. ఈ కల్కి రూట్స్ అన్నీ ఫ్రాన్స్ బేస్డ్ గానే ఉంటాయి. అమ్మడు ఫాలో అ్యే ఫ్యాషన్ లో కూడా ఈ డిఫరెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు జరిగిన వయాకామ్ బాష్ లో కూడా.. అందరికంటే డిఫరెంట్ గా కనిపించడానికి ఈ ఫ్యాషన్ పుట్టిల్లయిన పారిస్ స్టయిలే. బ్లాక్ బాటమ్ కి తోడు.. బ్రా టైపులో కనిపించే టాప్ ధరించింది. ఈ పార్టీ థీమ్ వైట్ అయ్యే సరికి అందరూ వైట్ డ్రసింగ్ లో బాగానే మెరిశారు కానీ.. క్లీవేజ్ షో చేస్తూ.. కల్కి వేసిన డ్రస్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి.

ఇక బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ ఫ్యాషన్ ని తన స్టైల్ లో ఫాలో అయిపోయింది. టబు లాంటి సీనియర్ సుందరీమణులు కూడా వైట్ అండ్ వైట్ లో బాగానే మెరిశారు. ఓ ప్రొడక్షన్ కంపెనీ ఈవెంట్ కావడంతో.. వీలైనంతగా గ్లామర్ డోస్ ని పంచేందుకు భామలు బాగానే ట్రై చేశారు