Begin typing your search above and press return to search.
వ్యభిచారి అని అవమానించారు
By: Tupaki Desk | 24 Dec 2019 4:10 AM GMTదర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయిన అనంతరం ఫ్రెంచి గాళ్ కల్కి కొచ్లిన్ ప్రముఖంగా చర్చల్లోకొచ్చింది. బ్రేకప్ తరువాత కొన్నాళ్లకు గయ్ హెర్ష్ బర్గ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. రెండేళ్లుగా అతడితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆ క్రమంలోనే బేబి బంప్ ని ప్రదర్శిస్తూ పలు మ్యాగజైన్లు.. మీడియాలకు కల్కి ఇంటర్వ్యూలు ఇస్తోంది.
అలా ఓ ఇంటర్వ్యూలో కల్కి తన గతం గురించి చెప్పి షాకిచ్చింది. కల్కి ఫ్రెంచ్ పేరెంట్ కి పాండిచ్చేరి(ఇండియా)లో జన్మించింది. తాను హిందీ పూర్తిగా మాట్లాడగలదు. కానీ తనని ఓ రష్యన్ అని ముంబై మీడియా భావించేదట. అంతేకాదు.. ఓ పత్రికలో రష్యన్ వ్యభిచారి అని రాసేశారట. కెరీర్ ఆరంభంలో ఇలాంటి అవమానాలెన్నో ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.
మీడియా వాళ్లు పరిశ్రమలో ఉన్న వ్యక్తుల్ని నిర్ణయించేస్తారు. అందుకే కెరీర్ ప్రారంభంలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చిందని కల్కి తెలిపింది. అప్పట్లోనే ఓ నిర్మాత తనని డేట్ కి పిలిచాడు. మీటూ ప్రాబ్లెమ్ ని ఎదుర్కొంది. అయితే తాను ఆ నిర్మాత ప్రపోజల్ కి స్పందించకపోవడంతో అటుపై ఛాన్స్ కోల్పోవాల్సి వచ్చిందని రివీల్ చేసింది కల్కి. ఆ క్రమంలోనే దర్శకుడు అనురాగ్ తో ప్రేమాయణం అనుబంధం తెలిసిందే.