Begin typing your search above and press return to search.

మాజీ భర్తతో ఈ మూమెంట్ మళ్లీ రాదు

By:  Tupaki Desk   |   7 Dec 2017 1:14 PM GMT
మాజీ భర్తతో ఈ మూమెంట్ మళ్లీ రాదు
X
సాధారణంగా భార్య భర్తలు విడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నా. ఫైనల్ గా ఇద్దరిమధ్య అర్థం చేసుకోవడం అనే పదం ప్రశ్నగా మారినపుడే అపోహలు అనుమానాలు అయిష్టాలు అన్ని వస్తాయి. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారు. ఈ రోజుల్లో క్షణికవేశాల్లో వచ్చిన కోపాలు విడాకుల వరకు వెళుతున్నాయి. మళ్లీ ఆ మనిషిని కలవకూడదు అని కొత్త జీవితాన్ని నాకు నచ్చిన జీవితాన్ని గడపాలని సెకండ్స్ లో డివోర్స్.. నిమిషాల్లో మరో పెళ్లి.. ఈ తరహా సీన్స్ ఎక్కువగా ఎక్కడ చూస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సినిమా రంగంలో ఇలాంటి విడాకులు ప్రతి శుక్రవారం ఓ సినిమా రిలీజ్ అయినట్టు.. ప్రతి నెలలో ఎదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. అయ్యో.. ఎందుకు విడిపోయారు? అనుకునే లోపే మళ్లీ ఎక్కడో ఒక చోట ఫ్రెండ్ లా కలిసి ఓ ఫొటోకి స్టీల్ ఇస్తారు. ఇదే తరహాలో ఓ ప్రముఖ దర్శకుడు తన మాజీ భార్య తో సరదాగా గడిపిన క్షణం ఇప్పుడు నెట్ లో ఫొటోల రూపంలో వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ - కల్కి కొచెలిన్ 2011 లో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కాని నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. రీసెంట్ గా ఇద్దరు కలిసి చాలా సేపు చర్చించుకున్నారు. కొన్ని ఆడియో క్యాసెట్లను కలసి విన్నారట.

ఇక కల్కి ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇలాంటి మూమెంట్ మళ్లీ మళ్లి రాదు అంటూ ఓ మ్యాటర్ ని క్యాచీగా గా చెప్పేసింది. దీంతో నెటీజన్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.