Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్‌ తొమ్మిదేళ్లకే సెక్సులో పాల్గందట

By:  Tupaki Desk   |   11 April 2015 3:30 PM GMT
ఆ హీరోయిన్‌ తొమ్మిదేళ్లకే సెక్సులో పాల్గందట
X
బాలీవుడ్‌ హీరోయిన్‌ కల్కి కొచ్లిన్‌ ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటపెట్టారు. తొమ్మిదేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పిన ఆమె ఆ వయసులో నాతో సెక్స్‌ చేయడానికి ఒకర్ని అనుమతించినట్లు చెప్పింది. అప్పుడు సెక్స్‌ అంటే ఏమిటో కూడా నాకు పూర్తిగా తెలీదు. ఇంట్లో తెలుస్తుందని భయ పడ్డాను. ఆ విషయాన్ని మా అమ్మానాన్నలతో చెప్పాలనే అవగాహన కానీ, స్థైర్యం కానీ నాకున్నట్లయితే ఇన్నేళ్లుగా వేదన అనుభవించి ఉండేదాన్ని కాదని కల్కి చెప్పింది.

సెక్స్‌ గురించి స్వేచ్ఛగా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు పిల్లలు భయపడరాదని.. అలాంటి వాతావరణం ఇళ్లలో ఉండాలని కల్కి తన అనుభవాన్ని రంగరించి చెప్పింది. సెక్స్‌పై పిల్లల్లో అవగాహన కలిగించడం ద్వారా బయటకు చెప్పుకోలేని ఇలాంటి లైంగిక వేధింపుల నుంచి వాళ్లను కాపాడవచ్చన్నారు. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో వచ్చిన %''%దేవ్‌ డి%''% చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ పాండిచ్చేరి భామ తన నటనతో ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసింది. ఫ్రెంచి సంతతికి చెందిన కల్కి తన తొలి సినిమా దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ నే పెళ్లి చేసుకుంది. అయితే రెండేళ్ల కాపురం తర్వాత వారు విడిపోయారు.