Begin typing your search above and press return to search.
పెళ్లి అయ్యే వరకు కన్యగా ఉండాలంటే ఎలా?
By: Tupaki Desk | 2 Jan 2019 5:56 AM GMTఫ్రెంచి ఇండియన్ అయిన కల్కీ కొచ్లీన్ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించిన కల్కీ హిందీ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ను పెళ్లి చేసుకుంది. ఆయనతో పడక పోవడంతో కొన్నాళ్లకే అతడి నుండి విడిపోయింది. ఫ్రెంచిలో పుట్టి పెరగడం వల్ల ఈమె ఆలోచనలు మరియు భావనలు చాలా మోడ్రన్ గా అనిపిస్తూ ఉంటాయి. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపథ్యంలో ఈమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరికి షాక్ ఇచ్చింది.
సెక్స్ విషయంలో ఆడవారికి పూర్తి స్వేచ్చ కావాలంది. ఎవరితోనైనా సెక్స్ ఆసక్తి లేకుండా నో చెప్పే అమ్మాయి, యస్ అని చెప్పే రోజు కూడా రావాలని కల్కీ చెప్పుకొచ్చింది. సెక్స్ విషయంలో పూర్తిగా ఆడవారి ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్చను ఇవ్వాలంది. పెళ్లి అయ్యే వరకు కన్యగా ఉండి, కన్యత్వంను భర్తకు బహుమానంగా ఇవ్వాలనేది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం అయ్యే పని కాదంది.
కన్యత్వం అనేది నిధి కాదు, దాన్ని భర్తకు బహుమానంగా ఇచ్చేందుకు అది ఒక వస్తువు కాదు అంది. పెళ్లి అయ్యే వరకు కన్యగా ఉండటం అంటే అమ్మాయి తన స్వతంత్య్రంను కలిగి లేదన్నట్లే అంటూ కల్కీ వింత వాదన చేస్తోంది. పాశ్చత్య పద్దతిలో ఆమె పద్దతి నడుస్తుందేమో కాని, ఇండియాలో మాత్రం ఇంకా అంతగా అభివృద్ది, పాశ్చత్య పద్దతులు అలవాటు కాలేదనే విషయాన్ని ఆమె తెలుసుకోవాలి.