Begin typing your search above and press return to search.

క‌ల్కి రిలీజ్ తారుమారు? అస‌లేమైంది?

By:  Tupaki Desk   |   18 May 2019 8:56 AM GMT
క‌ల్కి రిలీజ్ తారుమారు? అస‌లేమైంది?
X
ఒక డ‌బ్బింగ్ సినిమా వ‌స్తోంది అంటే స్ట్రెయిట్ రిలీజ్ ల‌ విష‌యంలో సందిగ్ధ‌త ఎందుకు? వాళ్ల కంటెంట్ కంటే మ‌న కంటెంట్ బెట‌ర్ కాద‌ని అంగీక‌రించ‌డ‌మా? మ‌న‌లో లోపం ఉందన్న భావ‌నా? లేక మ‌న స్టార్ కి అంత స‌త్తా లేద‌నా? ఎందుకు సైడివ్వాల్సొస్తోంది? మ‌న‌మీద డ‌బ్బింగుల స‌వారీ ఇంకెన్నాళ్లు? డ‌బ్బింగ్ రిలీజ్ ల‌ను తిప్పి కొట్ట‌లేమా? ఇవ‌న్నీ ఎంతో కాలంగా టాలీవుడ్ ని వేధిస్తున్న క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌లు. వీటికి స‌మాధానం ఇవ్వ‌కుండా నీళ్లు న‌ములుతూనే ఉన్నారు మ‌న నిర్మాత‌లు. చెట్టు ముందా.. విత్తు ముందా? అన్నంత ఝ‌టిలం చేసేశారు స‌మ‌స్య‌ను. అందుకే డ‌బ్బింగ్ సినిమాలు య‌థేచ్ఛ‌గా వ‌స్తున్నాయి. టాలీవుడ్ పై దండ‌యాత్ర చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు డ‌బ్బింగ్ రిలీజ్ లు వ‌స్తున్నాయి అంటే మ‌న‌వాళ్లు సైడివ్వ‌డం కూడా తాజాగా చ‌ర్చ‌కు తెర‌లేపింది. అస‌లింత‌కీ ఏం జ‌రుగుతోంది?

ఈ నెలాఖ‌రున నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ క్యూలో ఉన్నాయి. వీటిలో క‌ల్కి లాంటి క్రేజు వ‌చ్చిన సినిమా కూడా ఉంది. యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్ ను పోలీసాఫీస‌ర్ గా కామిక్ స్టైల్లో ఆవిష్క‌రిస్తున్నార‌ని రిలీజైన పోస్ట‌ర్లు.. టీజ‌ర్లు చెబుతున్నారు. మ‌గాడు అంత ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ మోడ్ ఉంద‌ని టీజ‌ర్ చెప్పింది. ఈ సినిమా రిలీజ్ తేదీ మే 31 అంటూ ఫిక్స్ చేశారు. కానీ ఇంత‌లోనే ఏమైందో అనూహ్యంగా వాయిదా వేశార‌ని ప్ర‌చార‌మైంది. అస‌లు.. రాజ‌శేఖ‌ర్ స్టామినాపై మార్కెట్ వ‌ర్గాల‌కు న‌మ్మ‌కం లేదా? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. హైప్ వ‌చ్చాక ప్రీబిజినెస్ స‌వ్యంగా సాగాక ఎందుకీ వాయిదా? అంటూ ట్రేడ్ లో చ‌ర్చ సాగుతోంది.

మే 31న రిలీజ్ తేదీలు ఖాయం చేసుకున్న‌వి ప‌రిశీలిస్తే... సూర్య ఎన్జీకే.. జ‌య‌ప్ర‌ద‌- సాక్షి చౌద‌రి.. సువ‌ర్ణ సుంద‌రి .. అభినేత్రి 2.. ఫ‌ల‌క్ నుమా దాస్.. అదేరోజు బ‌రిలో నిలిచాయి. వీట‌న్నిటికంటే క‌ల్కి క్రేజు వేరు. సూర్య ఎన్జీకే చిత్రాన్ని కె.కె. రాధామోహ‌న్ చేజిక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆయ‌న చేతికే క‌ల్కి హ‌క్కులు ద‌క్కాయి. కానీ ఆయ‌న డ‌బ్బింగును ముందు రిలీజ్ చేసి క‌ల్కిని త‌ర్వాత రిలీజ్ చేయ‌డం వెన‌క లాజిక్ ఏంటో అర్థం కావ‌డం లేద‌ని అంటున్నారు. చూద్దాం.. తెలుగు సినిమాకి అన్యాయం? డ‌బ్బింగుకి న్యాయం? ఇదేంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. సూర్య న‌టించిన `ఎన్ జీకే` కోస‌మే రాజ‌శేఖ‌ర్ `క‌ల్కి` చిత్రాన్ని వాయిదా వేయ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. అయితే ఒకేరోజు నాలుగైదు సినిమాలు రిలీజ‌వుతుండ‌డంతో మంచి థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్ట‌మ‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నారా? డి.సురేష్ బాబు.. దిల్ రాజు లాంటి థియేట‌ర్ల ఓన‌ర్లు.. కం పంపిణీదారులు మంచి సినిమాల రిలీజ్ సాయానికి ముందుకొస్తుంటే క‌ల్కి ఎందుకు వెన‌క‌డుగు వేసిన‌ట్టు? పైగా `దొర‌సాని` కోసం సురేష్ బాబుతో క‌లిసి జీవిత కాంపౌండ్ టీమ్ వ‌ర్క్ చేస్తున్నారు క‌దా? డ‌బ్బింగు కోసం సైడిచ్చేయ‌డం స‌రైన‌దేనా? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. మ‌రి దీనికి రాజ‌శేఖ‌ర్ - జీవిత & టీమ్ ఏం స‌మాధానం చెబుతారో వేచి చూడాలి.