Begin typing your search above and press return to search.
మోషన్ పోస్టర్: రాజశేఖర్ కల్కి
By: Tupaki Desk | 26 Aug 2018 8:52 AM GMTయాంగ్రీ యంగ్ మ్యాన్ గా 90వ దశకం మొదలుకుని చాలా ఏళ్ళ పాటు ఆవేశపూరిత పోలీస్ పాత్రలతో పాటు అల్లరి ప్రియుడు లాంటి లవర్ బాయ్ సినిమాల్లో కూడా మెప్పించిన హీరో రాజశేఖర్ కల్కిగా వస్తున్నాడు. ఆ మధ్య వరస పరాజయాల నేపధ్యంలో కొంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ గత ఏడాది గరుడవేగాతో మంచి కం బ్యాక్ ఇచ్చారు. బడ్జెట్ పరిమితులు దాటాకపోతే కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అనిపించుకునేది కానీ హీరోగా రాజశేఖర్ కు అది బాగా హెల్ప్ అయ్యింది. మళ్ళి కొంత టైం తీసుకుని కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మతో జట్టు కట్టాడు. నాని నిర్మించిన అ!! లాంటి భిన్నమైన సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ప్రశాంత్ వర్మ తనకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఇంత సీనియర్ హీరోతో చేయటం అంటే విశేషమే. ఇటీవలే తమన్నా దటీజ్ మహాలక్ష్మికి బాలన్స్ వర్క్ దర్శకత్వ బాద్యతలు పూర్తి చేసిన ప్రశాంత్ వర్మ ఇందులో రాజశేఖర్ ను 80ల నాటి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళబోతున్నాడు. ఏదో క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఇన్వెస్టిగేషన్ బిగిన్స్ అని కాప్షన్ గా పెట్టడం చూస్తే డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అనిపిస్తోంది.
టైటిల్ లోగోలో చాలా జాగ్రత్తలు తీసుకున్న ప్రశాంత్ వర్మ అందులో పొందుపరిసిన డీటెయిల్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పురాణాల్లో కల్కి అవతారం చెడును అంతమొందించే లక్ష్యంతో అవతరిస్తుంది. అందుకే ఇక్కడ కూడా లోగోలో హింసకు వాడే రకరకాల మారణాయుధాలను చూపిస్తూనే వామనుడి గొడుగు కృష్ణుడి మురళి ఇలా రకరకాల అంశాలను కలిపి కల్కిగా తయారు చేయించాడు. మొత్తానికి అంచనాలకు తగ్గిట్టే కల్కిలో రాజశేఖర్ ని చాలా సరికొత్తగా చూపించబోతున్నాడు ప్రశాంత్ వర్మ. హీరోయిన్ సపోర్టింగ్ కాస్ట్ టెక్నీకల్ టీమ్ తదితర వివరాలు ఏవి చెప్పలేదు కానీ మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలిసిపోతాయి. ఈ మధ్య అసలే వెనుకటి కాలం నేపధ్యంలో తీసుకున్న సినిమాలు మంచి ఫలితాన్ని అందుకుంటున్నాయి. కల్కి కూడా అదే తరహాలో 80ల కాలానికి తీసుకెళ్లిపోతుంది. టెక్నాలజీ సొద లేని మరో థ్రిల్లర్ రెడీ అవుతోందన్న మాట. చూద్దాం.