Begin typing your search above and press return to search.
స్టైలిష్ స్టార్ నే వెయిట్ చేయించాడు
By: Tupaki Desk | 17 July 2018 3:32 AM GMTఎంత మెగాస్టార్ చిన్నల్లుడు సినిమాగా ప్రమోట్ చేసినా విజేత ఓపెనింగ్స్ విషయంలో ఆశించిన ఫలితం అందుకోలేకపోవడంతో పాటు ఫైనల్ స్టేటస్ కూడా ఆ దిశగానే వెళ్తోంది. సరే ఎలాగూ మార్కెట్ లో యూత్ ని టార్గెట్ చేసిన ఆరెక్స్ 100 తప్ప ఇంకే స్ట్రెయిట్ మూవీ లేదు కాబట్టి ప్రమోషన్ చేసి కాస్త బూస్ట్ ఇద్దామనుకున్న నిర్మాత సాయి కొర్రపాటి మొన్న ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ గెస్ట్ కాబట్టి మీడియా అటెన్షన్ బాగానే వచ్చింది. లేకపోతే కవరేజ్ కూడా ప్రశ్నార్థకంగా మారేది. బన్నీ రావడానికి కారణం కూడా ఒకటే. మెగాస్టార్ మీద తనకున్న అపరిమితమైన అభిమానం. అందుకే వచ్చి నాలుగు ముక్కలు చక్కగా చెప్పి సెలవు తీసుకున్నాడు. కానీ ఈవెంట్ కన్నా ముందు కళ్యాణ్ దేవ్ వ్యవహార శైలి ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
వినిపిస్తున్న కథనం ప్రకారం ఈవెంట్ ఆ రోజు మధ్యాన్నం 1 గంటలు స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసారు. తనకు వేరే పర్సనల్ లంచ్ అటెండ్ అవ్వాల్సి ఉండటంతో బన్నీ చెప్పిన టైంకు కరెక్ట్ గా అక్కడ ఉన్నాడు. తనే కాదు హీరోయిన్ మాళవిక నాయర్ తో సహా టీమ్ కూడా వచ్చేసింది. ఇంతా చేసి హీరో మాత్రం లేడు. ఏంటబ్బా అని ఫోన్ చేస్తే వస్తున్న వస్తున్నా అంటూ అక్కడికి 2 గంటలకు చేరుకున్నాడు. సరే అయిందేదో అయ్యింది సభాముఖంగా తన కోసం వేచి చూసిన వాళ్లకు సారీ చెప్పేస్తే ఓ పనైపోయేది. అల్లుడు గారు అది కూడా మర్చిపోయారు. బన్నీ కూడా సర్దుకుని తన బాధ్యత నెరవేర్చి అక్కడి నుంచి వెళ్లేసరికి ఫామిలీ లంచ్ ఆలస్యం అయిపోయింది.
అయినా అతిథిగా అల్లు అర్జున్ ఈవెంట్ కి లేట్ చేస్తే తప్పు లేదు. కానీ హీరో కళ్యాణ్ దేవ్ ఆలస్యం చేయటం కరెక్ట్ కాదు. విజేతకు ఇంత డివైడ్ టాక్ ఉన్న నేపధ్యం లో సినిమా సర్కిల్స్ తో తన ఇమేజ్ పెరగాలి అంటే కళ్యాణ్ దేవ్ చాలా అప్రమత్తంగా ఉండాలి.అందులోనూ ఇలాంటి విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉండే చిరంజీవికి అల్లుడిగా ఇలా చేయటం కరెక్ట్ కాదనే కామెంట్స్ అక్కడున్న మీడియా నుంచే వెలువడ్డాయి. లేట్ గా రావడం తప్పు కాదు కానీ తన కోసం అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తన కుటుంబానికి సంబంధించినవాడైనా సరే కనీసం గౌరవంతో టైం వచ్చేలా చూసుకోవడమో లేదా సారీ చెప్పడమో చేయాల్సింది. కాస్త చూసుకో అల్లుడు అని అలెర్ట్ చేస్తున్నారు మెగా ఫాన్స్.