Begin typing your search above and press return to search.
విజేతని ఖైదీ చేస్తారా?
By: Tupaki Desk | 14 July 2018 7:24 AM GMTమెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రూపొందిన విజేత ప్రేక్షకులను పలకరించేసింది. హిట్టా ఫట్టా అనే లెక్కలు తేలడానికి ఇంకో రెండు మూడు రోజులు పడుతుంది కాని సినిమా పరంగా నెగిటివ్ రిపోర్ట్స్ రాకపోవడం మెగా కాంపౌండ్ రిలాక్స్ అయ్యేలా చేసింది. ఇరగదీసాడు అనే కామెంట్స్ రానప్పటికి చూడొచ్చు అనే ఫీడ్ బ్యాక్ కళ్యాణ్ దేవ్ గురించి రావడంతో రెండో సినిమాకు అడుగులు పడుతున్నాయట. విశ్వసనీయ సమాచారం మేరకు చిరంజీవి సూచన పాటించి కళ్యాణ్ దేవ్ ని పక్కా మాస్ సబ్జెక్టులో చూపించే ప్రయత్నాలు జరగబోతున్నాయని తెలిసింది. కథ ఏంటి దర్శకుడు ఎవరు అనే వివరాలు బయటికి చెప్పడం లేదు కానీ లోలోపల గట్టి చర్చలే నడుస్తున్నాయట. ఇంకా పూర్తి స్థాయి హీరోగా ప్రూవ్ కాకముందే మాస్ మసాలా ప్రయోగాలు చేయటం ఎంత వరకు కరెక్ట్ అనిపించొచ్చు కాని కేవలం ఫ్యామిలీ యూత్ సినిమాలతో మాస్ లో రిజిస్టర్ కావడం అసాధ్యం. అందుకే ఆలస్యం చేయకుండా కళ్యాణ్ దేవ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట.
సరే మొదటి సినిమాను ఫాదర్ సెంటిమెంట్ తో విజేత అనిపించారు ఇప్పుడు మాస్ పేరుతో వాళ్ళ కోసం ఖైదీ తీస్తారా అనే కామెంట్స్ మొదలైపోయాయి. ఏమైనా రెండో సినిమాకే ఇలా మాస్ జోలికి వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అనేది వేచి చూడాలి. పైగా కళ్యాణ్ దేవ్ ఫేస్ లో గ్లో ఉంది కాని మాస్ కి కనెక్ట్ అయ్యే రఫ్ నెస్ రావాలి అంటే ఇంకొన్ని సినిమాలు చేయాలి. కానీ కుర్రాడు అంతదాకా ఆగేలా లేడు. మెగా హీరోస్ కు ఫాన్స్ ఎంత బలమైనా అందరినీ వాళ్ళు మాస్ సినిమాల్లోనే చూడాలని కోరుకోవడం లేదు. వరుణ్ తేజ్ ఫిదా లాంటివి ఎన్నైనా హిట్ కొట్టొచ్చు కానీ తన ఫీచర్స్ కి రచ్చ - నాయక్ లాంటి సబ్జెక్ట్స్ నప్పవు. అందుకే వరుణ్ కూడా తనకు సూట్ అయ్యే పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. మరి కళ్యాణ్ దేవ్ ఒక్క సినిమాకే ఇంత రిస్క్ చేయటం అవసరమా అనే ప్రశ్న రేగడం సహజం. దీనికి సంబంధించిన ప్రకటన ఈ జులైలోనే రాబోతున్నట్టు తెలిసింది. మరి విజేత ఖైదీగా మారతాడా లేక స్వయంకృషిలా తనలో నటుడికి పరీక్ష పెట్టే వైపు మళ్లుతాడా ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది