Begin typing your search above and press return to search.
మెగా ఫ్యామిలీకి దూరంగా కళ్యాణ్..?
By: Tupaki Desk | 14 Dec 2021 1:30 AM GMT'విజేత' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ను వివాహం చేసుకున్న దేవ్.. తొలి సినిమాతో హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ కాలేదనే చెప్పాలి. అప్పటి నుంచి సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు వెళ్తున్న కళ్యాణ్.. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు.
రాబోయే మూడు సినిమాలతో కళ్యాణ్ దేవ్ కెరీర్ గాడిలో పడుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తుండగా.. ఇప్పుడు యువ హీరో మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్నారనే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు దీనికి కారణం రామ్ చరణ్ అనే ఓ రూమర్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది
ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకున్న వేడుకలలో అల్లుడు కళ్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించలేదు. దీనికి తోడు శ్రీజ గత కొన్ని నెలలుగా తన ఇన్స్టాగ్రామ్ లో భర్త కళ్యాణ్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయలేదు. దీంతో భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని.. అందుకే మెగా ఫ్యామిలీకి దేవ్ దూరంగా ఉంటున్నారని ఆ మధ్య ఊహాగానాలు వినిపించాయి.
అయితే ఇటీవల శ్రీజ బర్త్ డే సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మెగా అల్లుడు రూమర్స్ కు చెక్ పెట్టారు. తన అర్థాంగితో ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి లవ్ సింబల్ తో శుభాకాంక్షలు తెలపడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. కాకపోతే మెగా హీరోలకు కళ్యాణ్ ఎందుకు దూరంగా ఉంటున్నాడనే విషయం మీద సందేహాలు మాత్రం నివృత్తి కాలేదు.
ఈ నేపథ్యంలో బావ బావమరిది కళ్యాణ్ దేవ్ - రామ్ చరణ్ మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే మెగా ఫ్యామిలీ నుంచి చిన్నల్లుడు దూరంగా ఉంటున్నారనే పుకార్లు ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, అభిమానులు మాత్రం మెగా హీరోలందరూ ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకుంటున్నారు. మరి త్వరలోనే చెర్రీ - కళ్యాణ్ ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసి రూమర్స్ కు చెక్ పెడతారేమో చూడాలి.
ఇకపోతే కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం పులివాసు దర్శకత్వంలో ''సూపర్ మచ్చి'' సినిమా చేస్తున్నారు. అలానే 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ డైరెక్షన్ లో రామ్ తళ్లూరి నిర్మాణంలో ''కిన్నెరసాని'' అనే వైవిధ్యమైన చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇక శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. జీఏ 2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా ఫాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.