Begin typing your search above and press return to search.
`విజేత`ఎంపిక వెనుక `చిరు`సాయం లేదట!
By: Tupaki Desk | 12 July 2018 6:24 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో హీరో అవుదామని ...కొన్ని వేల మంది యువకులు పడిగాపులు కాస్తున్నారు. తమకు అందివచ్చిన చిన్నా చితకా పాత్రల్లో నటిస్తూనే హీరో చాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న క్యారెక్టర్ ల నుంచి పైకెదిగి హీరోస్థాయికి చేరిన వారిది ఒక కేటగిరీ అయితే.....ఓ సినీ `ఫ్యామిలీ`కి చెందిన వారు కావడంతోనో - రిఫరెన్స్ వల్లనో అవకాశాలు దక్కించుకున్న వారిది మరో కేటగిరీ. అయితే, `విజేత` సినిమాతో తెరంగేట్రం చేసిన మెగా అల్లుడు కల్యాణ్ దేవ్.... తన సినీ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చిరంజీవి గారి అల్లుడని తెలియకుండానే...తనకు `విజేత`లో అవకాశం దక్కిందని చెప్పారు. కేవలం తన తండ్రి పాత్రలో మురళీ శర్మను తీసుకోవాల్సిందిగా మాత్రమే ఆయన సూచించారని అన్నారు.
తాను సత్యానంద్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో కొత్త వారి కోసం నిర్మాత సాయి కొర్రపాటి - దర్శకుడు రాకేష్ శశి వెతుతుకున్నారని చెప్పారు. తనతోపాటు మిగిలిన వారి స్టిల్స్ చూసిన తర్వాత సాయిగారు ...తనను ఎంపిక చేశారని ...ఆ తర్వాత తానే చిరంజీవి అల్లుడని సత్యానంద్ గారు చెప్పడంతో సాయిగారు ఆశ్చర్యపోయారని కల్యాణ్ దేవ్ అన్నారు. దీనిని బట్టి తాను `స్వయంకృషి`ని నమ్ముకొని హీరో అయ్యానని....చిరంజీవి `కృషి`లేదని చెప్పాడు. కథ విషయంలో కూడా `చిరు`సాయం లేదని - మురళీశర్మను మాత్రమే తండ్రి పాత్రకు చిరు రిఫర్ చేశారని అన్నారు. అయితే, చిరు అల్లుడని తెలియకుండానే అవకాశం వచ్చిందనడం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. వేలాదిమంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో....కల్యాణ్ కాకతాళీయంగా ఎంపికవడం ఆశ్చర్యకరమే. లేదంటే అదృష్ట దేవత కల్యాణ్ తలుపు తట్టి....రిఫరెన్స్ లేకుండా అవకాశం వచ్చి ఉండాలి.