Begin typing your search above and press return to search.
చిరు అల్లుడు ఒకటే కథ విన్నాడట!
By: Tupaki Desk | 11 July 2018 12:52 PM GMTమెగా కుటుంబం నుంచి వస్తున్న మరో వారసుడు కళ్యాణ్ దేవ్. చిరంజీవి అల్లుడైన ఆయన సినీ రంగ ప్రవేశం అనూహ్యంగానే జరిగింది. సినిమాల్లోకి రావాలని ఎప్పట్నుంచో యాక్టింగ్ లో శిక్షణైతే తీసుకొంటున్నాడు కానీ... సినిమాని ఆరంభం మాత్రం చాలా వేగంగా ఆరంభించాడు. మామూలుగా ఒక పెద్ద కుటుంబం నుంచి వస్తున్న కథానాయకుడంటే కథల విషయంలో చాలా ఆలోచిస్తారు. బోలెడు కథలు విన్నాక కానీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. కానీ కళ్యాణ్ దేవ్ విషయంలో మాత్రం ఆ హంగామా ఏమీ లేదట. ఆ విషయాన్ని స్వయంగా కళ్యాణే చెప్పాడు. నేను విన్న మొదటి కథనే - నా మొదటి సినిమాకి ఓకే చేసేశానన్నాడాయన.
గురువారమే ఆయన తొలి చిత్రం విజేత ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో ప్రెస్ తో సమావేశమయ్యారాయన. ``తొలి సినిమా కాబట్టి మరిన్ని కథలు వినాలని ఉండేది - అయితే మావయ్యకి `విజేత` కథ చెప్పగానే ఆయన బాగుందని మెచ్చుకొన్నారు. ఇక దాంతో మరో విషయం గురించి ఆలోచించలేదు. నాకు సినిమా అనుభవం ఏమీ లేదు. చిరంజీవిగారికి ఈ రంగంలో విశేషమైన అనుభవం ఉంది కాబట్టి ఆయన సలహాని పాటించాను. మామయ్యకి కూడా కథ నచ్చాక తండ్రి పాత్రలో మురళీశర్మ అయితే బాగుంటుందనే సలహా తప్ప ఇంకేమీ చెప్పలేదు. అంతకుమించి ఆయన కథలో ఏమీ జోక్యం చేసుకోలేద``ని చెప్పుకొచ్చాడు చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్.