Begin typing your search above and press return to search.

కుమార్తెను మిస్స‌వుతున్నాన‌ని క‌ళ్యాణ్ దేవ్ ఎమోష‌న్

By:  Tupaki Desk   |   12 Feb 2023 8:00 PM GMT
కుమార్తెను మిస్స‌వుతున్నాన‌ని క‌ళ్యాణ్ దేవ్ ఎమోష‌న్
X
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల-క‌ళ్యాణ్ దేవ్ బ్రేక‌ప్ గురించి మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. కానీ వాటిని అధికారికంగా ఎవ‌రూ ధృవీక‌రించ‌లేదు. ఆ ఇరువురి న‌డుమా సోష‌ల్ మీడియా పోస్టులతో ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. తొలిగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో  రూమ‌ర్స్ బ‌ల‌ప‌డ్డాయి. కొంత కాలంగా మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో దీనిపై చ‌ర్చ సాగింది. అలాగే క‌ళ్యాణ్ న‌టించిన‌ సూపర్ మచ్చి- కిన్నెరసాని చిత్రాలు మెగా ప్ర‌మోష‌న్ లేకుండానే విడుద‌ల‌వ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

తాజాగా కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 11 తన కూతురు నవిష్క బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఎమోషనల్ అవుతూ ఓ వీడియోను క‌ళ్యాణ్‌ పోస్ట్ చేశారు. త‌న కుమార్తె నవిష్కతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మిస్సింగ్ యూ!! అని ఆవేద‌నను వ్య‌క్తం చేసారు. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం కాగా 2018లో వార‌సురాలు న‌విష్క జ‌న్మించింది. ప్రస్తుతం శ్రీజ వద్దనే నవిష్క ఉందని కళ్యాణ్ దేవ్ పోస్టు వెల్ల‌డిస్తోంది.

శ్రీజ తొలిగా శిరీష్ భరద్వాజ్ ను పెళ్లాడ‌గా ఈ జంట‌కు ఓ బిడ్డ జన్మించింది. అయితే అతనితో మనస్పర్థల వల్ల విడాకుల ప్ర‌హ‌స‌నం తెలిసిన‌దే. అనంత‌రం కొంత గ్యాప్ త‌ర్వాత చిరు త‌మ ద‌గ్గ‌ర‌ బంధువుల సంబంధం వెతికారు. కళ్యాణ్ దేవ్ ను శ్రీ‌జ‌ రెండో వివాహం చేసుకున్నారు.