Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ తో అల్లుడు కళ్యాణ్

By:  Tupaki Desk   |   2 Sep 2017 5:54 AM GMT
పవన్ కళ్యాణ్ తో అల్లుడు కళ్యాణ్
X
సెప్టెంబర్ 2 అంటే మెగా ఫ్యాన్స్ కు పెద్ద పండగ. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పుట్టిన బోలెడంత హంగామా చేసేస్తుంటారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఈ రోజు కంట్రోల్ చేయడం చాలా కష్టమైన విషయం. పవనిజం పీక్స్ కు వెళ్లిపోయే రోజు ఇది. మరి ఇలాంటి రోజున జనాలకు సర్ ప్రైజ్ లు కూడా లభించేస్తూ ఉంటాయి.

పవన్ బర్త్ డే ముందురోజున సడెన్ గా ఇలాంటిదే ఓ ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు.. ఆయన చిన్న కుమార్తె శ్రీజ భర్త అయిన కళ్యాణ్.. పవర్ స్టార్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు. చిరుకు అల్లుడు అంటే పవన్ కు కూడా అల్లుడే కాబట్టి.. చిన్న మామగారికి విషెస్ చెప్పడంలో వింతేమీ లేదు. అయితే.. ఈ కుర్రాడు సోషల్ మీడియాలో ఉన్నా.. ఫ్యాన్స్ తో అంత సోషల్ గా కలిసిపోయే టైపు కాదు. పైగా ఒక పక్కన మెగాస్టార్.. మరో పక్కన పవర్ స్టార్ నుంచుని ఉంటే.. మధ్యలో తాను ఉండి ఓ ఫోటో తీయించుకుని తన సోషల్ నెట్వర్కింగ్ పేజ్ లో పెట్టేసి షాక్ ఇచ్చాడు కళ్యాణ్. అరెరే.. ఈ ఫోటోలో చెర్రీ మిస్ అయ్యాడని అనుకునే ఛాన్స్ లేకుండా.. వెనకాల వాల్ పై ఉన్న పోస్టర్ లో రామ్ చరణ్ నవ్వుతూ దర్శనం ఇచ్చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ అల్లుడు కళ్యాణ్.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీకి సంబంధించిన పనులలో కీలకంగా ఉంటున్నాడు. మెగాస్టార్ 151వ చిత్రం సైరా కు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసేది ఇతనే. శ్రీజతో మ్యారేజ్ సమయంలో హీరో మెటీరియల్ టైపులో కళ్యాణ్ ఉండడంతో.. ఇతను కూడా సినిమా ఇండస్ట్రీలోకి వస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ తనకు నటనపై ఇంట్రెస్ట్ లేదంటూ సింపుల్ గా సైడ్ అయిపోయాడు ఈ అల్లుడు కళ్యాణ్.