Begin typing your search above and press return to search.

మెగా అల్లుడు మొదలుపెడుతున్నాడు

By:  Tupaki Desk   |   8 Dec 2017 4:22 AM GMT
మెగా అల్లుడు మొదలుపెడుతున్నాడు
X
మెగాస్టార్ వారుసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్కో రూట్ ఎంచుకుని తమ కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నారు. తమ ఫ్యామిలీ హీరోలంతా ఓ చోటకు చేరితే.. ఓ క్రికెట్ టీం అయిపోతుందని కూడా ఓ మెగా హీరో అన్న సంగతి జనాలకు గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేయడం  ఖాయమైంది. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ భర్త అయిన కళ్యాణ్ కానుగంటి.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేయనున్నాడు. గతంలో జత కలిసే చిత్రాన్ని రూపొందించిన రాకేష్ శశి.. కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే స్టోరీ కూడా సిద్ధం అయిందని.. ఈ టీంకు రామ్ చరణ్ గైడెన్స్ ఇస్తున్నాడని తెలుస్తోంది. అరంగేట్ర చిత్రం కోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో.. కళ్యాణ్ కు బాగా డీటైల్డ్ గా వివరిస్తున్నాడట మెగా పవర్ స్టార్. స్టోరీతో పాటు బౌండ్ స్క్రిప్ట్.. హీరో ప్రిపరేషన్స్.. అన్నీ పూర్తయితే.. ఇక చిరంజీవి అనుమతులు తీసుకోవడమే అంటున్నారు. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

గతంలో ఈగ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన సాయి కొర్రపాటి.. కళ్యాణ్ తొలి చిత్రానికి ప్రొడ్యూస్ చేయనున్నాడని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ కుర్రాడు తన ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ ని కూడా మార్చాడు. గతంలో సాఫ్ట్ బాయ్ మాదిరిగా కనిపించిన కళ్యాణ్.. ఇప్పుడు మేకోవర్ ఛేంజ్ చేసేసి.. బాలీవుడ్ హీరో టైపులో రెడీ అయిపోవడం గమనించాలి.