Begin typing your search above and press return to search.
సోగ్గాడి దర్శకుడు రికార్డు కొట్టాడు
By: Tupaki Desk | 23 Jan 2016 9:30 AM GMTకొత్త దర్శకులతో సినిమాలు చేసి విజయాల్ని అందుకోవడమెలాగో నాగార్జునకి బాగా తెలుసు. శివ మొదలుకొని ఆయన తరచుగా కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఒకట్రెండుమార్లు పరాజయాలు ఎదురైనా సరే... కొత్త ప్రతిభని ప్రోత్సహించడానికి మాత్రం ఆయన వెనకాడరు. ఆ ప్రయత్నం నాగ్ కి మరుపురాని విజయాల్ని అందిస్తూనే ఉంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం కూడా కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చేసిందే. కళ్యాణ్ కి దర్శకత్వ శాఖలో పదేళ్ల అనుభవం ఉంది. పలు చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
ఆ అనుభవంతోనే సోగ్గాడే చిన్ని నాయనాని పర్ ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్ గా తెరకెక్కించాడు. ఆ చిత్రం ఇప్పుడు బాక్సాఫీసు దగ్గర సంచలనాల్ని నమోదు చేస్తోంది. లోకల్ మార్కెట్ లోనూ - ఓవర్సీస్ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్ కలెక్షన్ల పరంగా కొత్త దర్శకుడైన కళ్యాణ్ కృష్ణ తన పేరుమీద ఓ రికార్డు సొంతం చేసుకొన్నాడు. మొన్నటిదాకా ఓవర్సీస్ లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన డెబ్యూట్ డైరెక్టర్ సినిమాగా మిర్చి పేరిట రికార్డు ఉండేది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఓవర్సీస్ లో 631వేల డాలర్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డుని కళ్యాణ్ కృష్ణ తీసిన సోగ్గాడే చిన్ని నాయనా 655వేల డాలర్లతో అధిగమించడం విశేషం. ఈ దెబ్బతో నాగార్జున మరికొంతకాలం పాటు కొత్త టాలెంట్ ని విచ్చలవిడిగా ఎంకరేజ్ చేసే అవకాశాలున్నాయి.